//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఉత్ఖంట భరిత మ్యాచ్ లో చెన్నై అద్భుత విజయం....!

Category : sports

ఐపీల్ లో భాగం గా నిన్న రాత్రి జరిగిన చెన్నై, కోల్ కత్తా మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ లో అల్ రౌండర్ జడేజా సిక్స్ తో చెన్నై కి ఈ సీజన్ లో రెండో విజయాన్ని అందించాడు.

టాస్ ఓడి బాటింగ్ కు దిగిన నైట్ రైడర్స్‌ కు మంచి శుభారంభం దక్కలేదు, చివరి మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిన సునీల్ నరైన్ కేవలం 4 బంతులు ఎదుర్కొని 12 పరుగులు చేసి అవుటయ్యాడు. తరువాత మరో ఓపెనర్ లైన్ కూడా తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు.

మిగతా అందరూ కూడా తక్కువ స్కోర్ కె పెవిలిపోయాం క్యూ కట్టారు. ఈ సమయం లో బాటింగ్ కి వచ్చిన కెప్టెన్ డీకే, ఆండ్రీ రసెల్‌ ఆచూతూచి మొదలుపెట్టారు. డీకే నిదానంగా ఆడుతుంటే ఆండ్రీ రసెల్‌ సిక్సర్ లతో చెలరేగిపోయాడు.

కేవలం 36 బంతులు ఎదుర్కొని ఒక్క బౌండరీ, 11 సిక్సర్లతో 88 పరుగులు చేశాడు. కేవలం 27 బంతుల వ్యవధిలో పది సిక్సర్లు కొట్టాడు. దీనితో కోల్ కతా నైట్ రైడర్స్ సీజన్‌ లో తొలిసారి 200 పరుగుల పైగా లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ కి నిర్దేశించింది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.

తరువాత బాటింగ్ కి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించింది. షేన్‌ వాట్సన్‌ ( 42) వచ్చిన బంతిని వచ్చినట్టే బౌండరీ లైన్ దాటించడంతో చెన్నై స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అతనికి జతగా ఇన్నింగ్స్ ఆరంభించిన అంబటి రాయుడు (39) ఫర్వాలేదనిపించాడు. రైనా (14), ధోనీ ( 25) విఫలమైనప్పటికీ ఆ ప్రభావం ఇన్సింగ్స్ పై పడకుండా శామ్‌ బిల్లింగ్స్‌ (56) ధాటిగా ఆడడంతో లక్ష్యం క్రమంగా తగ్గుతూ వచ్చింది. చివర్లో అతను ఔటైనప్పటికీ రవీంద్ర జడేజా చివరి ఓవర్ లో భారీ షాట్లతో, జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది.