//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చెన్నై సూప‌ర్ కింగ్సే.. ఒక్క ఓవర్‌తో ఫలితం తారుమారు..!

Category : sports

చెన్నై సూప‌ర్ కింగ్స్ మ‌రోసారి ఐపీఎల్ ఫైన‌ల్‌కి చేరుకుంది. ఐపీఎల్‌ ఫైనల్‌ చేరడం చెన్నైకి ఇది ఏడోసారి. ఇక తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ స్కోరు 19 ఓవర్‌కు 119/6. క్రీజులో ఉన్న విండీస్‌ హార్డ్‌ హిట్టర్‌ బ్రాత్‌వైట్‌ చివరి ఓవర్‌లో 20 పరుగులు సాధించి హైదరాబాద్‌కు కాపాడుకోగల స్కోరు 139 అందించాడు. కానీ అదేం విచిత్రమో.. ఛేదనలో అదే బ్రాత్‌వైట్‌ ఒక్క ఓవర్‌ (18) లో 20 పరుగులిచ్చి చేతికి అందిన విజయాన్ని దూరం చేసేశాడు. దీంతో అప్పటి వరకు అద్భుతంగా బౌలింగ్‌ చేసిన యువ పేసర్‌ సిద్ధార్థ్‌ కౌల్‌ 19వ ఓవర్‌లో తీవ్ర ఒత్తిడికి గురయ్యి 17 పరుగులిచ్చేసి.. మ్యాచ్‌ను చెన్నై పరం చేసేశాడు. భువి వేసిన చివరి ఓవర్‌లో 6 పరుగులు చేయాల్సి ఉండగా డుప్లెసిస్‌ తొలి బంతికే సిక్సర్‌ బాది తన జట్టును ఫైనల్‌ చేర్చేశాడు. తొలుత బ్రావో (2), చాహర్‌, ఎంగిడి, శార్దూల్‌ ఠాకూర్‌, జడేజా తలో వికెట్‌ తీసి సన్‌రైజర్స్‌ను 139కి పరిమితం చేశారు. బ్రాత్‌వైట్‌ (43 నాటౌట్‌; 29 బంతుల్లో 1×4, 4×6) మినహా మరెవ్వరూ రాణించలేదు. విలియమ్సన్‌ (24), యూసఫ్ పఠాన్‌ (24) ఫర్వాలేదనిపించారు.

ఇక ఛేదనకు దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ను సన్‌రైజర్స్‌ బౌలర్లు బాగానే వణికించారు. రషీద్‌ ఖాన్‌ (4-0-11-2) తనపై నమ్మకాన్ని నిలబెట్టాడు. అతడికి తోడుగా భువి (1), కౌల్‌ (2) సైతం రాణించడంతో వాట్సన్‌ (0), రైనా (22), అంబటి రాయుడు (0), ధోనీ (9), డ్వేన్‌ బ్రావో (7), జడేజా (3), దీపక్‌ చాహర్‌ (10) త్వరగా ఔటయ్యారు. దీంతో చెన్నై 15 ఓవర్లకు 93/7తో నిలిచింది. విజయం కష్టంగానే కనిపించింది. ఐతే అప్పటికి 39 పరుగులతో ఉన్న డప్లెసిస్.. భజ్జీ సహాయంతో ఓపికగా పరుగు పరుగు తీస్తూ ముందుకు సాగాడు. ఒక చెత్త ఓవర్‌ కోసం ఎదురుచూశాడు. 18 ఓవర్‌లో బ్రాత్‌వైట్‌ను లక్ష్యం చేసుకొని 20 పరుగులు సాధించాడు. అర్ధశతకం సాధించాడు. ఆ తర్వాతి ఓవర్‌లో 17 పరుగులు చేసి విజయాన్ని గుప్పిట బంధించాడు. ఓపెనర్‌ వచ్చి అజేయంగా నిలిచి చివరి ఓవర్‌ తొలి బంతికి సిక్సర్‌ బాదేసి చెన్నైని ఫైనల్‌కు చేర్చేచేశాడు. ఏది ఏమైనా చెన్నై మ‌రోసారి ఐపీఎల్‌లో కింగ్స్ అని నిరూపించింది. ఇక‌పోతే ఫైనల్‌ చేరేందుకు సన్‌రైజర్స్‌కు మరో అవకాశముంది. ఫైనల్లో స్థానం కోసం ఆ జట్టు ఎలిమినేటర్‌లో విజేతతో క్వాలిఫయర్‌-2లో తలపడుతుంది.

Related News