//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బాబుకి షాక్ జగన్ గూటికి 'ఆ' ఎమ్మెల్యేలు !

Category : politics

మనం ఎక్కడైతే ప్రారంభించామో ఎప్పటికైనా అక్కడికే రావాలి అనేది అక్షర సత్యం. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైసీపీ నుండి టీడీపీ లో వెళ్లిన ఎమ్మెల్యే లకు సరిగ్గా సరిపోతుంది. పార్టీ ని వదిలి వెళ్లిన ఎమ్మెల్యే లు తిరిగి తమ సొంత ఇంటికి రావటానికి ప్రయత్నాలు మొదలు పెట్టారని రాజకీయ వర్గాల సమాచారం.

పార్టీ మారితే మాకు లాభం చేకూరుతుందని కొందరు,గత్యంతరం లేక కొందరు పార్టీ మధ్యలో విడిచిపెట్టి ఇంకో పార్టీ లో జాయిన్ అయ్యారు. తీరా కొన్నాళ్లు గడిచేసరికి అక్కడుంటే మొదటికే మోసం తప్పదని వారిలో చాలామందికి అర్థం అవుతోంది. అలాంటి వారిలో కొందరు తిరిగి మళ్లీ జగన్ నీడకు చేరడానికి ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం.

వైసీపీ నుండి టీడీపీ లోకి మొత్తం 23మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు. ప్రధానంగా పదవులు ఆశచూపించి, కేసుల రూపేణా భయపెట్టి, కాంట్రాక్టులంటూ ప్రలోభ పెట్టి, అధికార పార్టీ వీరిని తమలో కలిపేసుకుంది. వీరిలో కొంతమందికి పార్టీ లో కీలక పదవులు దక్కగా ఇంకొందరికి పార్టీ లో మేము ఉన్నామని చెప్పుకొనే స్థితి వచ్చింది.

పార్టీ ఫిరాయింపు సమయం లో ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని చెప్పి అందరికి తగిన న్యాయంచేస్తామని ఎమ్మెల్యే లను తమ పార్టీ లో లాక్కున్నారు. కానీ ఇప్పుడు అసెంబ్లీ సీట్లు పెరిగే పరిస్థితి లేదు కాబట్టి పార్టీ లో అంతర్గత కలహాలు మొద్దలయ్యాయని వినికిడి.

ఇప్పుడు సీట్లపెంపు జరిగేపని కాదని తేలిపోవడంతో, టిక్కెట్ల పరిస్థితి కూడా డైలమాగానే ఉన్నది. దీనితో ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో భయం మొదలైంది. ఇప్పటికే తమ తమ నియోజకవర్గాల్లో స్థానిక తెలుగుదేశం నాయకత్వంతో పొసగక అనేక చికాకులను ఎదుర్కొంటున్న వారు, టిక్కెట్ కూడా డౌటే అన్న విషయాన్ని ఆలోచిస్తున్నారు.

దీనితో టీడీపీ లో ఉండటం అసలుకే మోసం అని తెలుసుకుంటున్నారు. అందుకే తిరిగి వైసీపీ పార్టీ లో జాయిన్ కావడానికి సన్నాహాలు మొదలుపెట్టారని అంటున్నారు. వైసీపీ లోకి రావాలని అనుకున్నవారందరు ఇప్పుడు జగన్ కు టచ్ లోకి వస్తున్నారని సమాచారం. ఈ విషయం లో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని అందరిలోనూ ఆత్రుత మొదలైనది.

ఫిరాయించిన వారిలో ఎందరు తిరిగి వస్తాం అని ప్రతిపాదించినప్పటికీ.. వచ్చే ప్రతి ఒక్కరినీ తిరిగి వెనక్కు తీసుకోకుండా, గతంలో ఉన్న సమయంలో విశ్వాసపాత్రంగా ఉంటూ గత్యంతరం లేక వెళ్లిన వారిని మాత్రమే అనుమతించాలని జగన్ అనుకుంటున్నట్లుగా సమాచారం. ఇదంతా కూడా రాజకీయంగా మారుతున్న వాతావరణానికి తగినట్టు ఎవరికి వారు జాగ్రత్త పడుతుండడానికి చిహ్నం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related News