//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

Category : sports

ఇప్పుడు ప్రపంచం లోని క్రికెట్ బోర్డ్ ని శాసించే స్థాయికి ఇండియన్ బోర్డ్ చేరిపోయింది .ఇండియన్ క్రికెట్ అనగానే అందరికి గుర్తుకు వచ్చే పేరు సచిన్.ఈయన ను క్రికెట్ గాడ్ గా పిలువబడుతున్నాడు.ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ గా వున్నా విరాట్ కోహ్లీ కూడా ప్రపంచం లో ఉన్న మేటి బ్యాట్స్ మేన్స్ నుండి ప్రశంసలను పొందుతున్నాడు

ప్రస్తుతం ఇండియా సౌత్ ఆఫ్రికా సిరీస్ లో వున్నారు. సిరీస్ కోసం భారత జట్టు ఆరాటం ఓ వైపు గెలిచి నిలిచేందుకు సఫారీల పోరాటం మరో వైపు ఈ నేపథ్యంలో ఇరు జట్లు రెండో టీ20కి సిద్ధమవుతున్నాయి. టెస్టు సిరీస్‌కోల్పోయిన తర్వాత టీమిండియా ఒక్కసారిగా గేరు మార్చింది.

భీకర ఆటతీరుతో దక్షిణాఫ్రికాను బెంబేలెత్తిస్తూ ఆరు వన్డేల సిరీస్‌ను 5-1తో సగర్వంగా దక్కించుకుంది. ఇప్పుడు పొట్టి ఫార్మాట్‌లోనూ అదే జోరు తొలి మ్యాచ్‌లో విజయానంతరం సిరీస్‌ కోసం రెండో టీ20పై కన్నేసింది. సమష్టి ఆటతీరుతో విరుచుకుపడి మరో మ్యాచ్‌ ఉండగానే విజేతగా నిలవాలనుకుంటోంది. అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా కనిపిస్తున్న కోహ్లీ సేనను ప్రత్యర్థి ఏమేరకు నిలువరిస్తుందో చూడాలి.

మరోవైపు సఫారీలు చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో ఉన్నారు. సొంత గడ్డపై ఆడుతున్నా కూడా వారి కష్టాలు వర్ణణాతీతం. తీవ్ర ఒత్తిడిలో ఉన్న ప్రొటీస్‌ ఈ మ్యాచ్‌లో ఓడితే సిరీస్‌ గల్లంతైనట్టే ఈ స్థితిలో టాప్‌ ఆర్డర్‌ అంచనాలకు తగ్గట్టుగా రాణించి భారత్‌ను దెబ్బతీయడంతో పాటు చివరి మ్యాచ్‌ వరకు పోరాటాన్ని తీసుకెళ్లాలనుకుంటోంది.

మూడో టెస్టులో అద్భుత విజయాన్ని అందుకున్న అనంతరం ఇప్పటిదాకా ఏడు మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు కేవలం ఒక్కసారి మాత్రమే ఓడింది. కోహ్లీ సేన ఆటతీరు ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇదే జోరుతో దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగే రెండో టీ20లో భారత్‌ తలపడనుంది.

ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో ఉండగా ఈ మ్యాచ్‌లోనూ నెగ్గితే మూడు టీ20ల సిరీస్‌ను కూడా తమ ఖాతాలో వేసుకోగలుగుతుంది. ఈ సిరీ్‌సను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేస్తే భారత్‌ టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకుంటుంది. మరోవైపు మూకుమ్మడి వైఫల్యం ప్రొటీ్‌సను ఇబ్బందిపెడుతోంది.

తొలి మ్యాచ్‌ను అద్భుతంగా ముగించిన భారత్‌ ఆత్మవిశ్వాసంతో ఉంది. పవర్‌ప్లేలో రోహిత్‌, ధవన్‌ పరిస్థితులకు తగ్గ ట్టు వేగంగా ఆడారు. అనూహ్యంగా వన్‌డౌన్‌లో దిగిన రైనా అంతర్జాతీయ క్రికెట్‌ ఆడి చాలాకాలమైనా మంచి టచ్‌తో కనిపించాడు. ఈసారీ అతను అదే స్థానంలో రావొచ్చు. కానీ మిడిలార్డర్‌ నుంచి ఆశించిన స్థాయిలో పరుగులు రావడం లేదు.

ధోనీ, మనీశ్‌ పాండేలకు తొలి మ్యాచ్‌లో ఎక్కువ సమయం ఆడే చాన్స్‌ వచ్చినా వేగం కనిపించలేదు. వచ్చీ రావడంతోనే ధోనీ బ్యాట్‌ను ఝుళిపించలేకపోతున్నాడు. ఇక పాండే 27 బంతుల్లో 29 రన్సే చేయడంతో చివర్లో స్కోరు పెరగలేదు. పాండ్యా నిరాశపరుస్తూనే ఉన్నాడు. బౌలింగ్‌లో మాత్రం భారత్‌ పూర్తి భరోసాతో ఉంది. పేసర్‌ భువనేశ్వర్‌ ప్రధాన అస్త్రంగా మారి జట్టును ఆదుకుంటున్నాడు. పిచ్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఉనాద్కట్‌ను తప్పించి మరో స్పిన్నర్‌గా కుల్దీప్‌ను జట్టులోకి తీసుకోవచ్చు.

డుప్లెసిస్‌, డివిల్లీర్స్‌లాంటి స్టార్‌ ఆటగాళ్లు లేని స్థితిలో దక్షిణాఫ్రికాను పరాజయాలు మరింత ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాయి. శత్రుదుర్భేద్యంగా కనిపిస్తున్న టీమిండియాపై సఫారీలు పైచేయి సాధించడం కష్టమవుతోంది. తొలి మ్యాచ్‌లో ఓపెనర్‌ హెన్‌డ్రిక్స్‌ మినహా అంతా విఫలమయ్యారు.

డివిల్లీర్స్‌ స్థానంలో ప్రత్యామ్నాయ ఆటగాడిని ప్రకటించకపోవడంతో తమకు అందుబాటులో ఉన్న ఆటగాళ్లతోనే కెప్టెన్‌ డుమిని సర్దుకోవాల్సిన పరిస్థితి ఉంది. పవర్‌ప్లేలో షార్ట్‌ బంతులతో భయపెడదామనుకున్న వీరి వ్యూహం విఫలమైంది. ఈ మ్యాచ్‌లో సఫారీ బౌలర్లకు పిచ్‌ సహకరిస్తే మరింత బౌన్స్‌తో మరోసారి అదే వ్యూహంతో చెలరేగాలని చూస్తోంది. ప్యాటర్సన్‌ స్థానంలో స్పిన్నర్‌ ఫంగిసోకు స్థానం లభించవచ్చు.

రెండో టీ20లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆడడంపై స్పష్టత కనిపించడం లేదు. తుంటి భాగంలో నొప్పి కారణంగా తను తొలి టీ20లో ఫీల్డింగ్‌ చేస్తున్నప్పుడు మైదానాన్ని వీడాడు. నేలపై నుంచి బంతి తీయడంలో తను ఇబ్బందిపడ్డాడు. దీంతో ముందుజాగ్రత్తగా డగౌట్‌లో విశ్రాంతి తీసుకోవడం కనిపించింది.

కానీ ఇదేమంత తీవ్రగాయం కాదని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ చెబుతోంది. బుధవారం ఉదయం వరకు ఈ విషయంలో స్పష్టత వస్తుందని పేర్కొంది. అయితే మున్ముందు సుదీర్ఘ సిరీస్‌లను దృష్టిలో ఉంచుకుని అతడికి విశ్రాంతి కల్పిస్తే కేఎల్‌ రాహుల్‌ జట్టులోకి వచ్చే అవకా శాలున్నాయి.

ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య ఈ రోజు సాయంత్రం 4 : 30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.