Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మీడియాకు కుంబ్లే లీక్ లతో క్రికెట్ లో ముదిరిన సంక్షోభం !

Posted 9 months ago | Category : sports

ఎప్పుడు దూకుడు మీదుండే కెప్టెన్ విరాట్ కోహ్లీకి, పని పట్ల నిబద్ధతతో వ్యవహరించే కోచ్ అనిల్ కుంబ్లే ల మధ్య విభేదాలు చెలరేగడంతో భారత క్రికెట్ జట్ లో సంక్షోభం పతాక స్థాయికి చేరుకొంది.  కెప్టెన్‌తో పాటు జట్టులోని సీనియర్లు జంబో వ్యవహరిస్తున్న తీరును సహించలేకపోతున్నట్లు తెలుస్తున్నది. అందుకు ప్రధాన కారణం సీనియర్ క్రీడాకారులతో జరిగిన వ్యక్తిగత సంభషణలను కుంబ్లే ఎంపిక చేసిన మీడియాకు లీక్ చేయడమే అని తెలుస్తున్నది. 

ఎంపిక చేసిన మీడియా కు సంబంధించిన ఒక వాట్స్ అప్ గ్రూప్ ను కుంబ్లే నిర్వహిస్తున్నారని, క్రీడాకారులతో జరిగిన అంతర్గత సంభాషణలను తరచూ వారికి లీక్ చేస్తున్నారని అనుమానిస్తున్నారు. మినీ ప్రపంచకప్‌గా భావించే చాంపియన్స్ ట్రోఫీలో దాయాది పాక్‌తో మ్యాచ్ సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడటం సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నది.  కొత్త కోచ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజు చివరి రోజు కాగా, ఉదయం వరకు ఎవ్వరూ ఆసక్తి చూపక పోవడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. 

కుంబ్లే తో తిరిగి పనిచేయడం సాధ్యం కాదని కోహ్లీ స్పష్టం చేసిన్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా కోచ్ పదవి కోసం రెండు పేర్లు తెరపైకి వస్తున్నాయి. వారు వీరేంద్ర సేవాహాంగ్, రాహుల్ ద్రావిడ్. ఐపియల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ టీం కు ద్రావిడ్ సారధ్యం వహిస్తూ ఉండడంతో జస్టిస్ లోధా కమిటీ సిఫార్సుల మేరకు ఆయన కోచ్ గా అర్హత పొందలేరు. 

కోచ్సే పదవి కోసం సవాహాంగ్ ఆసక్తి చూపుతున్న దాఖలాలు లేవు. అయితే కనీసం ఒక మెయిల్ ను బీసీసీఐ కార్యదర్శి ఐడి కి పంపమని ఆయనపై వత్తిడి వస్తున్నట్లు తెలిసింది. బాగా పేరు ప్రఖ్యాతులు గల క్రీడాకారుడు కోచ్ గా అవసరం లేదని, జట్టులో అందరిని కూడగట్టుకొని పోగల వారు కావాలని బీసీసీఐ అధికారులు సూచిస్తున్నారు. ఇంతకు ముందు ఎంతో  పేరున్న  గ్రెగ్ చాపెల్ ను పెట్టుకొంటే జట్టును రెండుగా చీల్చి విధ్వసం సృష్టించారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. 

ఇలా ఉండగా, కోహ్లీ, కాంబ్లీ ల మధ్య సయోధ్య కుదర్చడం కోసం బోర్డు పరిపాలక కమిటీ (సీవోఏ) చీఫ్ వినోద్‌రాయ్  ప్రయత్నం చేయనున్నట్లు తెలిసింది. ఆయన జూన్ మొదటివారం లండన్ లోనే ఉండి, ఈ దిశలో ప్రయత్నం చేయనున్నారు. 

వీరి మధ్య ఏర్పడ్డ అభిప్రాయ భేదాలను తొలిగించేందుకు బీసీసీఐ సలహా కమిటీ సభ్యులు సచిన్, గంగూలీ, లక్ష్మణ్ లు కూడా ప్రయత్నం చేసే అవకాశముంది. అయితే ఒక పరిష్కారం కుదరని పక్షంలో జూన్ 10 నాటికి కొత్త కోచ్ ను నియమించ వలసి ఉంటుంది. 


మహిళల శక్తి మరోసారి చాటారు

Posted 5 hours ago | Category : sports

మహిళల శక్తి మరోసారి చాటారు

మరోసారి హిట్ మెన్ కెప్టెన్ కానున్నాడు

Posted 16 hours ago | Category : sports

 మరోసారి హిట్ మెన్  కెప్టెన్ కానున్నాడు

పి వి సింధు అవార్డులు : pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton ins.media

Posted 4 days ago | Category : sports

పి వి సింధు అవార్డులు  :  pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton  ins.media

క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

Posted 4 days ago | Category : sports

 క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

Posted 8 days ago | Category : sports

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

కోహ్లి రికార్డుల మోత..!

Posted 8 days ago | Category : sports

కోహ్లి రికార్డుల మోత..!

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

Posted 9 days ago | Category : sports

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

Posted 11 days ago | Category : sports

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

Posted 12 days ago | Category : sports

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

సఫారీలతో మ్యాచ్ టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

Posted 12 days ago | Category : sports

సఫారీలతో మ్యాచ్  టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!

Posted 14 days ago | Category : sports

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!