ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ లో బాల్ ట్యాంపరింగ్ కి పాల్పడిన ఆస్ట్రేలియా ఆటగాళ్ళు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ విషయంలో ఆస్ట్రేలియా జట్టు భయపడుతుందా..? అంటే అవుననే అంటున్నారు క్రీడా పండితులు. ఆస్ట్రేలియా జట్టులో ఈ ఇద్దరు కీలక ఆటగాళ్ళు.
ఒకరు లెగ్ స్పిన్నర్ గా కెరీర్ ప్రారంభిస్తే వార్నర్ అసలు దేశవాళి క్రికెట్ ఆడకుండా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలో వీరు ఇద్దరు ఆ జట్టు వెన్నుముకల్లా మారిపోయారు. ఓపెనింగ్ తో వార్నర్ అదరగొడుతుంటే..స్మిత్ వన్ డౌన్ లో వండర్స్ చేస్తున్నాడు.
వీరిద్దరూ లేకపోతే ఆ ప్రభావం జట్టు ఆటపై పడే అవకాశం ఉంది. ఇది ఆఖరిదైన నాలుగో టెస్ట్ లో స్పష్టంగా కనపడింది. అయితే తనపై నిషేధం విధించడంతో ఇక తాను భవిష్యత్తులో క్రికెట్ ఆస్ట్రేలియాకి ఆడేది లేదని స్పష్టం చేసాడు వార్నర్. దీనితో క్రికెట్ ఆస్ట్రేలియా వీరిని బుజ్జగించే పనిలో పడింది. ‘‘నాకు ఆ ముగ్గురు వ్యక్తిగతంగా తెలుసు, వాళ్లు చాలా మంచి వ్యక్తులు, అందరూ తప్పులు చేస్తారు, వాళ్లు కూడా చేశారు.
కానీ వీళ్లు చేసిన తప్పుకి చాలా పెద్ద శిక్షని అనుభవిస్తున్నారు. కానీ వాళ్లు తిరిగి వచ్చే సమయానికి అందరూ మద్దుతగా నిలిచి వాళ్లపై మనకు ఇంకా నమ్మకం ఉందని నిరూపించాలని ఒకసారి ఈ ముగ్గురిపై నిషేధం ముగియగానే వాళ్లని కచ్చితంగా జట్టులోకి తీసుకుంటానని ఆస్ట్రేలియా క్రికెట్ నేషనల్ సెలెక్టర్ మార్క్ వా ప్రకటించారు.
అలాగే వారు జట్టులో లేకపోవడం జట్టుకి తీరని నష్టామని అభిప్రాయపడ్డాడు. దీనితో వారు జట్టుకి దూరం కాకుండా ఉండేందుకే క్రికెట్ ఆస్ట్రేలియా బుజ్జగించే పనిలో పడిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.