//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సోషల్ మీడియా వార్తల విశ్వసనీయత ?

Category : editorial

సోషల్ మీడియా కేవలం సామాజిక సంబంధాలు, పరిచయాలు కలిగించడమే కాకుండా వార్తలు అందించే వేదికగా కూడా విస్తృత ప్రాబల్యం పొందుతున్నది. అయితే సోషల్ మీడియా లో వస్తున్న వార్తల పట్ల విశ్వసనీయత మాత్రం ప్రశ్నార్ధకరంగా మారుతున్నది. 

ప్రధాన స్రవంతి  మీడియా దృష్టి ఆకర్షించలేని కొన్ని వార్తలను అందుబాటులోకి తేవడంలో సోషల్ మీడియా కీలక పాత్ర వహిస్తున్నప్పటికీ చాలామంది అందులో వస్తున్న వార్తలను నమ్మడం లేదని, ప్రధాన స్రవంతి మీడియా వార్తలనే ఎక్కువగా విశ్వసిస్తున్నారని తాజా సర్వే ఒకటి తెలిపింది. అయితే ఈ సర్వే ప్రకారం 54 శాతం మంది వార్తల కోసం సోషల్ మీడియా పై ఆధార పడుతున్నారు. 

రాయిటర్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ అఫ్ జర్నలిజం జరిపిన `డిజిటల్ న్యూస్ రిపోర్ట్' సర్వే లో 36 దేశాలకు చెందిన సోషల్ మీడియా ను ఉపయోగిస్తున్న 70 వేల మంది పాల్గొన్నారు. వీరిలో 24 శాతం మంది, అంటే నాల్గొవ వంతు కన్నా తక్కువ మంది మాత్రమే సోషల్ మీడియా కల్పిత కథనాలను వేరుచేసి వార్తలను తెలుపుతున్నదని సంతోషం వ్యక్తం చేశారు. 

అయితే ప్రధాన స్రవంతి మీడియా పట్ల 40 శాతం మంది, అంటే దాదాపు రెట్టింపు మంది ఆమోదం తెలిపారు. ప్రధాన స్రవంతి మీడియా సహితం విశ్వసనీయత గలదని చెప్పలేకపోయినా సోషల్ మీడియా కన్నా దాదాపు రెట్టింపు మంది దీనినే విశ్వసిస్తున్నారని సర్వే నివేదికకు సారధ్యం వహించిన నిక్  న్యూమెన్ చెప్పారు. 

ఈ సర్వే ప్రకారం అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో రెట్టింపు మంది నకిలీ వార్తలను వేరు వేయడంలో న్యూస్ మీడియా పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దీర్ఘకాలంలో నకిలీ వార్తలు జర్నలిజంకు కళంకం తెస్తాయని అంటూ, ప్రధాన స్రవంతి మీడియా విలువను నిలబెట్టడంలో వార్తల నాణ్యత పట్ల దృష్టి సారించ వలసిన అవకాశం ఇదే అని న్యూమెన్ పేర్కొన్నారు. 

Related News