//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జనసేనతో పొత్తు పట్ల సిపియం ఆసక్తి !

Category : national

2019 ఎన్నికలలో ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జన సేన పార్టీ తో పొత్తు ఏర్పరచు కోవడం పట్ల సిపియం ఆసక్తిగా ఉన్నట్లు కనిపిస్తున్నది. ఒక వంక వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తో పొత్తుకు ప్రయత్నం చేస్తున్నా ఆ పార్టీ నుండి నిర్దుష్టమైన సానుకూల సంకేతాలు లభించక పోవడంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నట్లు తెలుస్తున్నది. 

ఇప్పటికే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పవన్ కళ్యాణ్ ను కలసి రాజకీయ అంశాలపై సమాలోచనలు జరిపారు. జనసేనతో కలిసి పనిచేయడంపై రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పడం ద్వారా సీపీఎం జాతీయ‌ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నేడు విజయవాడలో ఈ విషయమై స్పష్టమైన సంకేతం ఇచ్చారు.

అయితే పొత్తుల విషయంలో పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు స్పష్టమైన వైఖరిని వెల్లడించక పోవడంతో వామపక్షాలు ఈ విషయమై ఇంకా ఒక నిర్ధారణకు రాలేక పోతున్నాయి. 

ఇలా ఉండగా, ఈనెల 15నుంచి 30 వరకు వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రజాఉద్యమం చేపడతామని ఏచూరి తెలిపారు. గత మూడేళ్లలో ప్రజలపై ఆర్థికభారం అన్ని రంగాల్లో పెద్ద ఎత్తున పెరిగిందని అంటూ దక్షిణ భారతదేశంలో కరువు పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

తమిళనాడులో ఇటీవల 200 మంది రైతులు ఆతమహత్యలు చేసుకున్నారని అంటూ దేశంలో మూడేళ్లుగా 12 నుంచి 16వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. దేశంలో ఆధార్‌ ఇబ్బందులతో 60శాతం మందికి రేషన్‌ దొరకట్లేదని పేర్కొన్నారు. 

2009లోనే ఈవీఎంలను వామపక్షాలు వ్యతిరేకించాయని అంటూ ఈవీఎంలు వాడితే ఓటర్లకు స్లిప్‌ ఇవ్వాలన్నది తమ ప్రధాన డిమాండ్‌ ని స్పష్టం చేశారు. కశ్మీర్‌లో శాంతిభద్రతల విషయంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.