//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్‌కౌంటర్ పై జగన్ స్పందన.. టిఆర్ఎస్ పై దాడులు ముమ్మరం..!

Category : national

శుక్రవారం ఉదయం తెలంగాణ-చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల సరిహద్దులో దట్టమైన అడవుల్లో పోలీసులకు, మావోయిస్టు నక్సలైట్ల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 10మంది నక్సలైట్లు మృతిచెందగా వారిలో ఏడుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. గతంలో జరిగిన ఎన్‌కౌంటర్లను పరిశీలిస్తే ఒకేసారి ఏడుగురు మహిళా నక్సలైట్లు చనిపోయిన దాఖలాలు లేవని తెలుస్తోంది.

కాగా చనిపోయిన వారిలో రత్న అనే మహిళా నక్సలైట్ హన్మకొండ మండలం రాంపూర్ చెందినట్లు గుర్తించారు. మిగతా ఆరుగురు చత్తీస్‌ఘడ్‌లోని దంతెవాడ, సుక్మా‌లకు చెందినట్లు భావిస్తున్నారు. ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతో కాలకృత్యాలు తీర్చుకుంటున్న వారిపై ఏకపక్షంగా పోలీసులు కాల్పులు జరిపారని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఈ దాడి పై సీపీఐ మావోయిస్టు జగన్ ఖండిస్తూ ‘ఇకపై మేము టీఆర్ఎస్ నేతలపై దాడులను ముమ్మరం చేస్తాం అని, హిందుత్వ నాయకుడు రమణ్‌సింగ్, నియంత కేసీఆర్‌లు కలిసికట్టుగా ఆదివాసీలపై, ప్రశ్నించే వారిని నిర్మూలించేందుకు దుర్మార్గమైన దాడులకు పాల్పడుతున్నారు’ అని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేర్కొన్నారు.

ఆయన పేరుతో శనివారం మీడియాకు ఓ ప్రకటన అందింది. కార్పొరేట్లకు వనరులు దోచిపెట్టడం కోసం తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్‌గడ్ ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ నిర్మూలనే లక్ష్యంగా దాడులు చేస్తున్నారని, ప్రజల సహకారంతో ఈ దాడులన్నింటినీ తిప్పికొడతామని ఆయన అన్నారు.

నీళ్లు, భూమిని కార్పొరేట్ శక్తులు దారాదత్తం చేసేందుకే నియంత అయిన కేసీఆర్ ఈ విధమైన బూటకపు ఎన్‌కౌంటర్లకు పాల్పడుతున్నారని ఆయన విరుచుకుపడ్డారు. అలాగే నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో ముఖ్యనాయకులు చనిపోయారని ప్రచారం చేసి ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని జగన్ పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌లో హరిభూషణ్, బడే చొక్కారావు, కంకణాల రాజిరెడ్డి చనిపోలేదన్నారు.