//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ధనుష్ కొంపముంచిన పుట్టుమచ్చలు ??

Category : editorial movies

ధనుష్ నిజంగా డైరక్టర్ కస్తూరిరాజా కొడుకు కాదా..కదిరేశన్, మీనాక్షి దంపతుల కొడుకేనా ఇదే నిజమైతే పెద్ద షాకే అని చెప్పాలి. ఎందుకంటే వీళ్లిద్దరూ గత ఏడాదికాలంగా ధనుష్ చిన్నప్పుడే తమ నుంచి పారిపోయిన కొడుకని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఆ కేసుపైనే జస్టిస్ ప్రకాష్ అనే జడ్జి ఓ కీలకమైన ప్రశ్న సంధించి ఈ గందరగోళాన్ని ఎక్కువ చేశారనే చెప్పాలి. 

ఎందుకంటే ఈ దంపతులు చెప్తున్న కథనం ప్రకారం చిన్ననాడు ధనుష్ వంటిపై కొన్ని పుట్టుమచ్చలు ఉన్నాయ్. వాటి ఆధారంగానైనా అతను తమ మూడవ సంతానం అని గుర్తించాలని కోరారు..ఖచ్చితంగా వాళ్లు ఏ పుట్టుమచ్చల గురించైతే చెప్పారో వాటినే ధనుష్ లేజర్ టెక్నాలజీతో తుడిపేశాడని కోర్టు గుర్తించింది.

              దీంతో ఇప్పుడు అనుమానాలు ధనుష్ వైపు మళ్లాయ్..నిజంగా అక్కడ పుట్టుమచ్చలు ఉంటే ఎందుకు తీయించుకున్నాడు..ధనుష్ కి కదిరేశన్ దంపతులకు ఏ సంబంధం లేకపోతే అక్కడ పుట్టుమచ్చులు ఉన్నాయని ఎలా తెలుసు..ఓ వేళ సెలబ్రెటీ కాబట్టి ధనుష్ పుట్టుమచ్చల సంగతులు కూడా ఎలాగోలా సంపాదించారని అనుకుందాం..వాటిని తీయించుకోవాల్సిన అవసరం ధనుష్ కి ఏం వచ్చింది. ఈప్రశ్నలు ఇప్పుడు కోర్టు కూడా వేయవచ్చు..అలానే తీర్పు మాత్రం ఇవ్వకుండా రిజర్వ్ లో ఉంచడంతో సస్పెన్స్ పీక్ స్టేజ్ కి చేరింది. ధనుష్ మాత్రం వీటిని కొట్టిపారేస్తూ ఆ ముసలిదంపతులు నెలవారీ ఆదాయం దండుకోవడానికే ఈ ఎత్తు వేసారని ఆరోపించాడు..మరి ఏది నిజమో కాలమే తేల్చాలి