//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాజకీయ పార్టీలకు కార్పొరేట్ నిధులతోనే అవినీతి

Category : national

కార్పొరేట్ సంస్థలు రాజకీయ పార్టీలకు  నిధులు సమకూర్చడం వల్లననే ఏడాదంతా కుంభకోణాలు జరుగుతూనే ఉన్నాయని ప్రముఖ జర్నలిస్ట్, హిందూ మాజీ ప్రధాన సంపాదకులు ఎన్ రామ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన రచన  'వై స్కామ్స్ ఆర్ హియ‌ర్ టు స్టే' పుస్త‌క  ఆవిష్కరణ సందర్భంగా హైదరాబాద్ లో మాట్లాడుతూ ఎన్నికల నిధులలో జరుగుతున్న అక్ర‌మాల‌ను అడ్డుకోవ‌డంలో ఎన్నిక‌ల సంఘం విఫ‌ల‌మైంద‌ని విచారం వ్యక్తం చేశారు.

 రాజ‌కీయ పార్టీల‌కు వ‌చ్చే కార్పొరేట్ ఫండింగ్ ఆగ‌డం లేద‌ని అంటూ ఈ విషయమై ఇటీవ‌ల ఆమోదించిన ఫైనాన్స్ బిల్లులో సహితం లొస‌గులు ఉన్నాయ‌ని చెప్పారు. రాజ‌కీయ పార్టీల‌కు విరాళాలు అంద‌జేసే పెద్ద వ్య‌క్తుల ఐడెంటిటీని గోప్యంగా ఉంచే విధంగా చ‌ట్టాలను త‌యారు చేయడం పట్ల అసమ్మతి వ్యక్తం చేశారు. చెక్కులు, బాండ్ల ద్వారా వ‌చ్చే నిధుల‌పై పార‌ద‌ర్శ‌క‌త ఉండ‌ద‌ని అంటూ రాజ‌కీయ పార్టీల‌కు కార్పొరేట్ నిధులు ఆగ‌నంత వ‌ర‌కు అవినీతి, కుంభ‌కోణాలు ఆగ‌వ‌ని స్పష్టం చేసారు.

తన గ్రంధంలో త‌మిళ‌నాడులో చోటుచేసుకున్న అవినీతిపైన ఒక అధ్యాయం ఉన్నదని తెలుపుతూ ఈ రాష్ట్రంలో ప్ర‌జా పంపిణీ బాగుంద‌ని  కొనియాడారు. త‌మిళ‌నాడు, చ‌త్తీస్‌ఘ‌డ్‌ లలో పీడీఎస్ వ్య‌వ‌స్థ బాగుంద‌ని రామ్ తెలిపారు. అవినీతి నిర్మూల‌న‌ను ఉద్య‌మంలా చేప‌ట్ట‌లేమ‌ని పిలుపిచ్చారు. చిన్న చిన్న‌గా అవినీతిని అంతం చేసే ప్ర‌య‌త్నాలు చేయాల‌ని రామ్ సూచించారు.

ఈ గ్రంధాన్ని తెలంగాణ మంత్రి కె టి రామారావు ఆవిష్కరిస్తూ ఎన్నిక‌ల్లో ఖ‌ర్చు చేస్తున్న డ‌బ్బులో చాలా వ‌ర‌కు అప్ర‌క‌టిత ఆదాయం ఉంద‌న్న విష‌యం వాస్త‌వ‌మేనని చెప్పారు. ఇది అవినీతి, ఇది కాదు అని ఎలా చెప్ప‌గ‌ల‌ర‌ని మంత్రి ఈ సంద‌ర్భంగా ప్ర‌శ్నించారు. కుంభ‌కోణాల నుంచి భార‌త్ విముక్తి పొందుతున్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ  2027లో ఎన్‌.రామ్ ఆ పుస్త‌కాన్ని రిలీజ్ చేస్తార‌ని చ‌మ‌త్క‌రించారు.  మంచి రోడ్లు, నిరంత‌ర విద్యుత్తు, వేగంగా ప‌నుల జ‌ర‌గాల‌న్న‌దే మ‌న దేశ ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌ని, వారి ఆలోచ‌న‌ల‌కు త‌గ్గ‌ట్టుగానే రాష్ట్ర ప్ర‌భుత్వం సేవ‌లు అందిస్తోంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

Related News