ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి గ్రామ వాలంటీర్ల పోస్టులు అని చెప్పి 4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తారని ఏ ముహూర్తాన అన్నారో కానీ దానికి సంబంధించి అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజుకొక రచ్చ నడుస్తూనే ఉంది. ఆ పార్టీ అభిమానులే గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలలో భారీ అవకతవకలు జరుగుతున్నాయని రోడ్డెక్కుతున్నారు. జగన్ ప్రవేశ పెట్టిన ఈ వాలంటీర్ ఉద్యోగాలు అన్ని కూడా స్థానిక ఎమ్మెల్యేల కను సన్నల్లోనే కేటాయిస్తున్నారని సామాన్య జనంతో పాటుగా ఆ పార్టీ అభిమానులే న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు.
ఈ నేపధ్యం లోనే యాదవోలు గ్రామ వైసీపీ పార్టీ నేతలు గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు తమ వర్గం వారికి ఇవ్వకుండా గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్యాయం చేసారని అతని ఇంటి ముందు పురుగుల మందు డబ్బాలు తో నిరసన తెలిపారు. ఇదంతా ఎమ్మెల్యే కనుసన్నల్లోనే వారికి నచ్చిన వారికే ఇచ్చుకుంటున్నారని అందుకు తమకు ఉద్యోగాలు రావడం లేదని వారు వాపోతున్నారు. వాలంటీర్ జాబ్స్ లో ఒక్క ఈ గ్రామలోనే ఇన్ని అవకతవకలు జరుగుతున్నా ఇంకా జగన్ దృష్టికి ఎందుకు వెళ్ళలేదు అన్నది తెలియాల్సి ఉంది.