//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

లంచం నేరమే.. మంచమూ నేరమే

Category : state

ప్రభుత్వోద్యోగులు లంచం రూపంలో మంచం కోరుకున్నా.. అది అవినీతి కిందకు వస్తుందని.. లైంగిక లబ్ధికి ఏడేళ్ల దాకా జైలు శిక్ష ఉంటుందని అవినీతి నిరోధక సవరణల చట్టం-2018 స్పష్టం చేస్తోంది. 1998 నాటి అవినీతి నిరోధక చట్టం లో అవినీతి అంటే ఏదైనా పనిని ఒకరికి అనుకూలంగా చేసి పెట్టేందుకు ప్రభుత్వోద్యోగి డబ్బు రూపేణా లబ్ధి పొందడం’ అని ఉండేదని ఓ సీనియర్‌ ప్రభుత్వాధికారి తెలిపారు.

‘2015 నవంబరులో మోదీ సర్కారు లాకమిషన్‌కు బాధ్యతలు అప్పగించగా.. 2016లో పార్లమెంట్‌లో సవరణల బిల్లును ప్రవేశపెట్టారు. ఈ ఏడాది జూలైలో దానికి రాష్ట్రపతి రాజముద్ర పడింది అని వివరించారు.

తాజా సవరణల ప్రకారం.. ఒకరికి అనుకూలంగా పని చేసేందుకు ప్రభుత్వోద్యోగులు, అధికారులు ప్రతిఫలంగా స్థిర, చరాస్తుల కొనుగోళ్లలో డౌన్‌ పేమెంట్లు పొందినా.. బంధుమిత్రులకు ఉద్యోగం వచ్చేలా చేసినా.. ఖరీదైన వస్తువులను స్వీకరించినా.. ఆ చర్యలు అవినీతి కిందకు వస్తాయి.

Related News