//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోదీ పాలనలో కార్పొరేట్ లకు రూ 50 లక్షల కోట్ల లాభం !

Category : national business

మూడేండ్ల నరేంద్ర మోదీ పాలనలో దేశంలో కొద్దిమంది కార్పొరేట్ ల సంపద రూ 50 లక్షల కోట్ల మేరకు పెరిగిన్నట్లు తెలుస్తున్నది. దేశీయ స్టాక్ మార్కెట్ వర్గాల సంపద దాదాపు ఆ మేరకు పెరగటమే అందుకు నిదర్శనంగా కనిపిసున్నది . 

 టాటా, బిర్లా, అంబానీ, బజాజ్ గ్రూపుల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.లక్ష కోట్ల చొప్పున పుంజుకుంది. స్టాక్ మార్కెట్లో కొనసాగిన మోదీ ర్యాలీలో హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎల్ అండ్ టీ, వేదాంత, గోద్రేజ్, మహీంద్రా, హిందూజా, ఐటీసీ గ్రూపుల మార్కెట్ విలువ కూడా భారీగా పెరిగింది. 

ద్రవ్యోల్భణం పెరగడం, ఉపాధి అవకాశాలు సన్నగిల్లడం, వ్యవసాయ-గ్రామీణ రంగాలలో వృద్ధి మందగించడంతో మోడీ పాలనలో అభివృద్ధి ఫలాలు కొద్దిమంది కార్పొరేట్ లే కైవసం చేసుకుంటున్నట్లు భావించ వలసి వస్తుంది. 

ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ)ల మార్కెట్ విలువ రూ.3.65 లక్షల కోట్ల మేర పెరుగుదలను నమోదు చేసుకుంది. మార్కెట్‌లోని అన్ని కంపెనీలు కలిపి లాభపడ్డ రూ.50 లక్షల కోట్లలో పీఎస్‌యూల వాటా 8 శాతం కంటే తక్కువ. అయితే, అన్ని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో ప్రభుత్వ సంస్థల వాటా 16 శాతంగా ఉంది. 

గడిచిన మూడేండ్లలో బీఎస్‌ఈ ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 6,000 పాయింట్లకు పైగా (26 శాతం) బలపడింది. బీఎస్‌ఈలోని లిస్టెడ్ కంపెనీలన్నింటి మార్కెట్ విలువ రూ.75 లక్షల కోట్ల నుంచి రూ.125 లక్షల కోట్ల స్థాయికి పుంజుకుంది. 

ఈ మూడేండ్లలో లిస్టెడ్ కంపెనీలు ఆర్జించిన లాభాల్లో సింహభాగం ప్రమోటర్ల జేబుల్లోకే వెళ్లనుంది. దేశీయ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు. భారత లిస్టెడ్ సంస్థల్లో రిటైల్ మదుపర్ల వాటా 10 శాతం కంటే తక్కువే.  దాన్నిబట్టి చూస్తే వారు ఆర్జించిన లాభాలు కూడా తక్కువే. 

సెబీ అధ్యయనం ప్రకారం పట్టణాలకు చెందిన కుటుంబాల్లో కేవలం 8 శాతం, గ్రామాలలో ఒకటి కన్నా తక్కువ శాతమే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. మ్యూచువల్ ఫండ్లలో పట్టణాల పెట్టుబడుల వాటా 10 శాతం కాగా, గ్రామీణుల వాటా 1.4 శాతమే. అంటే సుమారు 90 శాతం మంది జనాభాకు ఈ ఫలాలు అందుబాటులోకి రావడం లేదన్నమాట.