//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆవుల మందను తోలుకెళ్లిన పోలీసులు!

Category : national

రాజస్థాన్‌లో గోరక్షకుల వ్యవహారం మరింత ముదిరిపాకాన పడింది. హిందూత్వ కార్యకర్తల ఫిర్యాదు మేరకు పోలీసులు తన ఆవుల మందను తోలుకెళ్లిపోయారంటూ ఓ ముస్లిం కుటుంబం లబోదిబోమంటోంది. ఈ మేరకు రాజస్థాన్‌లోని అల్వార్‌కి చెందిన సుబ్బాఖాన్ అనే వ్యక్తి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమకు చెందిన మొత్తం 51 ఆవులను తోలుకెళ్లి గ్రామంలోని గోశాలలో పెట్టినట్టు ఆరోపించారు. అయితే ఆయన ఆరోపణలను పోలీసులు ఖండిస్తున్నారు. ఈ వ్యవహారంలో తమకు ఎలాంటి ప్రమేయం లేదనీ... స్థానికులే ఆవులను తోలుకెళ్లి గోశాలలో పెట్టినట్టు పేర్కొన్నారు. గత పదిరోజులుగా తన ఆవులను మందను వెనక్కి తెచ్చుకునేందుకు సుబ్బాఖాన్ కుటుంబం పోరాడుతూనే ఉంది.చివరకు తమకు న్యాయం చేయాలంటూ కిషన్‌గఢ్ పోలీసులతో పాటు సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డీఎం)ను ఆశ్రయించారు.