//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కేంద్ర మాజీ మంత్రి పై తుపాకి ఎక్కుపెట్టిన కానిస్టేబుల్ !

Category : national

కేంద్ర మాజీ మంత్రి, లోక్‌సభ ఎంపీ కమల్‌నాథ్‌కు ఓ కానిస్టేబుల్‌ తన సర్వీస్‌ రైఫిల్‌ను గురిపెట్టిన ఘటన మధ్యప్రదేశ్‌లో కలకలం రేపింది.

వెంటనే అప్రమత్తమైన ఆయన అంగరక్షకులు కానిస్టేబుల్‌ అడ్డుకొని పక్కకు తోసేశారు. వివరాలలోకి వెళితే కమల్‌నాథ్‌ ఢిల్లీకి చార్టెడ్‌ విమానంలో బయలుదేరేందుకు ఛిన్‌ద్వారాలోని విమానాశ్రయానికి శుక్రవారం వచ్చారు. ఈ సమయంలో రత్నేష్‌ పవార్‌ అనే కానిస్టేబుల్‌ అనుమానాస్పదంగా వ్యవహరించాడు. కమల్‌నాథ్‌ విమానం ఎక్కుతుండగా.. పవార్‌ తన సర్వీస్‌ రైఫిల్‌ను ఆయన వైపు గురిపెట్టి.. అనుమానాస్పదంగా కనిపించాడు.

ఈయనెవరు? ఎందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చారని అనుమానంతో ఎంపీకి గన్‌ గురిపెట్టారు. వెంటనే అప్రమత్తమైన ఎంపీ గన్‌మెన్లు కానిస్టేబుల్‌ను అడ్డుకొని పక్కకు తోసేశారు. ఎంపీ అంగరక్షకుల్లో ఒకరు కానిస్టేబుల్‌‌కు కమల్‌నాథ్ గురించి వివరంగా చెప్పడంతో నాలుక్కరుచుకున్నాడు.

ఈ ఘటన నేపథ్యంలో కానిస్టేబుల్‌ పవార్‌ను సస్పెండ్‌చేసి విచారణకు ఆదేశించామని ఏఎస్పీ నీరజ్‌ సోనీ వెల్లడించారు. కమల్‌నాథ్‌ ఛిన్‌ద్వారా లోక్‌సభ స్థానం నుంచి ఇప్పటివరకు 9 సార్లు ఎంపీగా గెలుపొందారు. అయితే, ఈ ఘటన కమల్‌నాథ్‌ దృష్టికి రాలేదు. ఆయన యథావిధిగా ఢిల్లీకి బయలుదేరారు.