Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నిద్రలేమితో మితిమీరిన కోపం.. చెక్ పెట్టండిలా

Category : health

మీకు ప్రతి చిన్న విషయానికి కోపం వస్తుందా? చాలా చిరాకుగా ఫీల్ అవుతున్నారా? మీరు చేసే పని మీద శ్రద్ద పెట్టలేకపోతున్నారా? ఎవరితో అయినా మాట్లాడాలన్నా విసుగనిపిస్తుందా ? మీరు సరిగ్గా నిద్రపోవడం లేదు అని అర్థం. నిద్రలేమి వల్ల కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. నిద్రలేమితో బాధపడే వారు అనుభవించిన నరకం అంతా ఇంతా కాదు.

పని ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోకపోవడం తదితర కారాణాల వల్ల చాలా మందికి నిద్రలేమి సమస్యలు ఏర్పడతాయి. అయితే ఈ సమస్య కారణంగా మరో పెద్ద సమస్య వెంటాడుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

రాత్రి పూట తక్కువ సమయం నిద్రపోయేవారు ఎక్కువ కోపం ప్రదర్శిస్తారని ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది. అంతేకాకుండా ఒక నిరాశపూరిత వాతావరణంలో ఉంటారని తెలిపింది. సాధారణంగా అలసిపోయిన వారిలో చికాకు కనిపిస్తుంది. అదే పరిస్థితి తక్కువ నిద్రపోయే వారిలోనూ ఉంటుందని, అకారణంగా ఎదుట వారిపై విరుచుకుపడతారని ఐయోవా స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు.

ఈ అధ్యయనం వివరాలను ఎక్స్‌పెరిమెంటల్‌ సైకాలజీ అనే జర్నల్‌లో ప్రచురించారు. ఈ మేరకు కొందరిని ఎంపిక చేసి రెండ్రోజులపాటు వారు ఎంతసేపు నిద్రపోవాలో చెప్పి చూశారు. కనీసం ఏడు గంటలకు పైగా నిద్రపోయిన వారు సాధారణంగా ఉంటే.. నాలుగు గంటల కంటే తక్కువ నిద్రపోయిన వారిలో చికాకు, కోపం కనిపించాయని తెలిపారు. అందుకే కంటినిండా నిద్రపోండి. కడుపు సరిపడా పౌష్టికాహారం తినండి. అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉండటమే కాదు, సరదాగా సంతోషంగా జీవితాన్ని గడప గలుగుతారు.