//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జైహింద్ అనండి.. పాక్ పోలీసులకు ఇండియా నుండి కాల్స్

Category : national

ఫోన్ కాల్ వచ్చింది.. కాల్ తీసిన వ్యక్తి హలో అన్నాడు.. ఫోన్ చేసిన వ్యక్తి జైహింద్ అన్నాడు.. ప్రతి రోజూ ఇదే తంతు. జైహింద్ అనే వరకు ఇలాగే కాల్ చేస్తాను అంటూ దబాయిస్తున్నాడు.. అరెస్ట్ చేద్దామంటే దేశం కాని దేశం.. కంప్లయింట్ చేసినా ఎవరూ పట్టించుకోరు.. అలాగని ఫోన్ తీసి పక్కన బెడితే ఎప్పుడు ఎవరు కాల్ చేస్తారో అనే టెన్షన్.. ఈ బాధ పాకిస్తాన్ దేశంలోని ఇస్లామాబాద్ పోలీస్ కంట్రోల్ రూంలోని అధికారులది.

వారికి ఫోన్ చేస్తుంది ఇండియాలోని ఓ వ్యక్తి. డిసెంబర్ 25వ తేదీ నుంచి ఇదే తంతు.. ఈ విషయాన్ని ఇస్లామాబాద్ పోలీసులే స్వయంగా ప్రకటించారు. ఆ గుర్తు తెలియని వ్యక్తిపై ఇస్లామాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు అయ్యింది. వివరాల్లోకి వెళితే..డిసెంబర్ 25వ తేదీ తెల్లవారుజామున 3.30 గంటలకు ఇస్లామాబాద్ పోలీస్ కంట్రోల్ రూంకి ఓ కాల్ వచ్చింది. ఫోన్ ఎత్తిన పోలీసులు హలో అన్నారు.. చేసిన వ్యక్తి జైహింద్ అంటూనే.. ఇన్స్ పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డిప్యూటీ ఇన్స్ పెక్టర్ జనరల్ తో మాట్లాడాలని కోరాడు. దీనికి పాక్ పోలీసులు నో చెప్పారు.

అంతే బండ బూతులు తిట్టాడు. అంతటితో ఆగకుండా జైహింత్ అనకపోతే మిమ్మల్ని పాక్ వచ్చి కొడతా అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. ఫస్ట్ డే కదా అని లైట్ తీసుకున్నారు. 26, 27, 28, 29 తేదీల్లోనూ అదే సమయానికి ఫోన్ చేసి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఇస్లామాబాద్ కంట్రోల్ రూం సబ్ ఇన్ స్పెక్టర్ షబ్బీర్ అహ్మద్ తెలిపారు.

ఈ కాల్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకునేందుకు పాక్ టెలి కమ్యూనికేషన్ కంపెనీ లిమిటెడ్ (PTCL)ని కోరగా.. భారత్ నుంచి వస్తున్నట్లు తెలిసిందని ఇన్ స్పెక్టర్ షబ్బీర్ అహ్మద్ వెల్లడించారు. పాక్ గుర్తించినట్లు చెబుతున్న అతని పేరు జషీ. ఇతనిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం పాక్ కు లేదు. అతనే అని కూడా గట్టిగా చెప్పలేకపోతుంది.