//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎమ్మెల్యే చెంప పగలకొట్టిన మహిళా కానిస్టేబుల్

Category : national

హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో శుక్రవారం కాంగ్రెస్ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో పార్టీ పరిస్థితులపై ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమీక్షిస్తారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆశా కుమారి అక్కడికి వెళ్ళారు. ఆమెను లోనికి అనుమతించలేదు. ఓ మహిళా కానిస్టేబుల్ ఆ ఎమ్మెల్యేను అడ్డుకున్నారు.

దీంతో రెచ్చిపోయిన ఆశా కుమారి ఆ కానిస్టేబుల్‌‌పై చేయి చేసుకున్నారు. దెబ్బ తిన్న బెబ్బులిలా ఆ మహిళా కానిస్టేబుల్ ప్రతిస్పందించారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ప్రతీకారం తీర్చుకున్నారు. ఆ ఎమ్మెల్యే ఆశా కుమారి చెంపపై ఛెళ్ళుమనిపించారు. దీంతో ఆశ అవాక్కయ్యారు. అక్కడ ఉన్నవాళ్ళు ఆ కానిస్టేబుల్ మరో దెబ్బ కొట్టకుండా అడ్డుకున్నారు.

ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆశా కుమారి డల్హౌసీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థి డీ ఎస్ ఠాకూర్‌ను ఓడించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఓడిన అభ్యర్థులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో రాహుల్ గాంధీ ఈ సమావేశంలో మాట్లాడతారు.