మరోమారు మెరిసిన సన్ రైజర్స్, వరుసగా రెండో విజయంతో సీజన్ లో ముందుకు సాగుతోంది ఛాంపియన్ జట్టు. మొదటి మ్యాచ్ లో పేలవ బౌలింగ్ ప్రదర్శనతో ఓటమి మూటగట్టుకున్న లయన్స్, ఇక రెండవ మ్యాచ్ లోను అత్యంత ఘోరంగా ఆడింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగులో చెత్త ప్రదర్శనతో మరోసారి ఓడింది. బంతితో రషీద్ (3/19) లయన్స్ ను ఆడుకుంటే.. బ్యాట్ లో వార్నర్ (76) బాదేశాడు.
ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్, గుజరాత్ పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన లయన్స్ ను పరుగులు చేయనీకుండా కట్టడిచేశారు బౌలర్ లు. ముఖ్యంగా రషీద్ ను ఎదుర్కొనేందుకు చాలా ఇబ్బంది పడ్డారు గుజరాత్ బ్యాటమెన్స్. మెక్కల్లమ్, రైనా, పించ్ లను అవుట్ చేసిన రషీద్ లయన్స్ తో ఆడుకున్నాడు. గుజరాత్ ను కేవలం 135 పరుగులకే కట్టడి చేశారంటే హైదరాబాద్ బౌలింగ్ ఎలా సాగిందో చెప్పనవసరంలేదు. జేసమ్ రాయ్ (31), దినేష్ కార్తీక్ (30), డ్వేన్ స్మిత్ (37) కొద్దిగా పోరాడటంతో ఆ మాత్రం పరుగులు చేసింది గుజరాత్.
తరవాత బ్యాటింగ్ ఆరంభించిన సన్ రైజర్స్ ధాటిగా ఆడింది. ధావన్ (9) వ్యక్తిగత పరుగుల వద్ద ఔటయినా, హెన్రిక్స్ (52*), వార్నర్ (76*) మరో వికెట్ పడకుండనే మ్యాచ్ ను ముగించారు. కెప్టెన్ వార్నర్ మరో విధ్వంసక ఇన్నింగ్స్ 45 బంతుల్లో 6*4 ,4*6 లలో చెలరేగిన వార్నర్ 76 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్ ను ముగించారు.
స్కోర్ వివరాలు :
గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్:
రాయ్ (సి) ధావన్ (బి) భువనేశ్వర్ 31; మెక్‌కలమ్ ఎల్బీ (బి) రషీద్ 5; రైనా ఎల్బీ (బి) రషీద్ 5; ఫించ్ ఎల్బీ (బి) రషీద్ 3; దినేశ్ కార్తీక్ (సి) నమన్ (బి) నెహ్రా 30; డ్వేన్ స్మిత్ (సి) శంకర్ (బి) భువనేశ్వర్ 37; ధవల్ రనౌట్ 1; ప్రవీణ్‌కుమార్ నాటౌట్ 7; థంపి నాటౌట్ 13; ఎక్స్‌ట్రాలు 3
మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 135;
వికెట్ల పతనం:
1-35, 2-37, 3-42, 4-57, 5-113, 6-114, 7-115
బౌలింగ్:
బిపుల్‌శర్మ 4-0-24-0; భువనేశ్వర్ 4-0-21-2; నెహ్రా 4-0-27-1; రషీద్‌ఖాన్ 4-0-19-3; కటింగ్ 3-0-29-0; హెన్రిక్స్ 1-0-12-0
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్:
వార్నర్ నాటౌట్ 76; ధావన్ (సి) మెక్‌కలమ్ (బి) ప్రవీణ్‌కుమార్ 9; హెన్రిక్స్ నాటౌట్ 52; ఎక్స్‌ట్రాలు 3;
మొత్తం: (15.3 ఓవర్లలో ఒక వికెట్‌కు) 140;
వికెట్ పతనం: 1-32
బౌలింగ్: రైనా 2-0-24-0; ప్రవీణ్ 2-0-16-1; బరోకా 3.3-0-33-0; ధవల్ 2-0-17-0; శివిల్ కౌశిక్ 4-0-29-0; బాసిల్ థంపి 2-0-21-0