//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మైక్ విసిరిన కోమటిరెడ్డి: స్వామిగౌడ్‌కు తీవ్ర‌గాయాలు : ఆస్పత్రికి తరలింపు

Category : politics

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే నిరసన పేరుతో శాసనసభలో కాంగ్రెస్ శాసనసభ్యులు వీరంగం ఆడారు.

కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా పలువురు సభ్యులు దురుసుగా ప్రవర్తించారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో మూడుసార్లు మైక్, ఒకసారి హెడ్ ఫోన్స్‌ను విసిరారు. అందులో ఒక మైక్ గాంధీ ఫోటోను తాకి స్వామి గౌడ్ కంటికి తగిలింది. దీంతో ఆయనను వెంటనే కంటి ఆస్పత్రికి తరలించారు.

గవర్నర్ బడ్జెట్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ పత్రాలు చించేయడం, అవి విసిరి నిరసన వ్యక్తం చేయడం తరుచూ చూస్తుంటాం. కానీ గవర్నర్‌ పైకి వస్తువుల విసరడం అనైతికం విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో స్వామిగౌడ్‌కు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం, రేపు ఉదయం సభలో వీరిపై సస్పెన్షన్ వేటు వేయవచ్చని సమాచారం.

Related News