//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మళ్ళి హోటల్ కి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

Category : politics national

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి యడ్యురప్ప రాజీనామా చెయ్యడంతో కాంగ్రెస్- జెడిఎస్ కూటమి అధికారం చేపట్టాడానికి గాను దూకుడుగు వ్యవహరిస్తున్నాయి. దీనితో ఇప్పుడు ఇరు పార్టీలు మంత్రి పదవుల విషయంలో తర్జన భర్జన పడుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ సీనియర్ నేత జీ పరమేశ్వరకు ఇచ్చేందుకు జేడీఎస్ సుముఖంగా ఉంది.

కానీ ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలిసికట్టుగా ఉంచడంలో కీలక పాత్ర పోషించిన ఆ పార్టీ సీనియర్ నేత.. మాజీ మంత్రి డీ కే శివ కుమార్... తనకు ఉప ముఖ్యమంత్రి పదవి కావాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఆ పదవి ఇచ్చేందుకు అటు జేడీఎస్ చీఫ్, కాబోయే ముఖ్యమంత్రి కుమారస్వామి, ఇటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ బెంగళూరు హిల్టన్ హోటల్‌కు రావాలని ఆ పార్టీ అధిష్ఠానం ఆదేశించినట్లు తెలిసింది. ఆయన కేంద్ర కమిటిలోకి తీసుకోవాలని భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది.