//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇద్దరి సభ్యత్వం రద్దు.. 11మందిపై సస్పెన్షన్..!

Category : politics

తెలంగాణ లో అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైయ్యాయి. సభ మొదలవగానే స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ నిన్న గవర్నర్ ప్రసంగం సందర్భంగా అసెంబ్లీలో దురదుష్టకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయని, దీనిపై తీవ్ర మనస్థాపం చెందినట్లు తెలిపారు.

తరువాత శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ నిన్నటి అరాచకమైన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అలాగే హరీష్‌రావు గారు ఉత్తమకుమార్, అరుణ, షబ్బీర్ అలీ, మాధవరెడ్డి , జానారెడ్డి, దామోదర్రెడ్డి , వంశిచంద్రెడ్డి ఫై సస్పెంషన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

దీనితో పాటుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ ల శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తీర్మానాన్ని పెట్టారు. స్పీకర్ దానికి ఆమోదం తెలిపారు. స్పీకర్ మాట్లాడుతూ నిర్ణయం కఠినమైనది , కానీ జరిగిన ఘటన కారణంగా నిర్ణయం తీసుకున్నాము.