//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ముంద‌స్తు ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం కాంగ్రెస్ మాస్ట‌ర్ ప్లాన్‌..!

Category : politics

ఈ నెల 22, 23వ తేదీల్లో Congress అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ‌లో విస్తృత ప‌ర్య‌ట‌న చేయ‌నున్నారు. 22, 23 వేత‌దీల్లో రెండు రోజుల‌పాటు రాష్ట్రంలోని ఉత్త‌ర తెలంగాణ‌, ద‌క్ష‌ణ తెలంగాణ‌తోపాటుగా హైద‌రాబాద్‌లోని ప్ర‌ధాన ప్రాంతాల్లో Congress ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌నున్న మూడు బ‌హిరంగ స‌భ‌ల్లో సోనియా గాంధీ పాల్గొన‌నున్నారు. ఇందుకు సంబంధించి టీపీసీసీ ఏర్పాట్ల‌ను ముమ్మ‌రం చేసింది.

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే టీఆర్ఎస్ పార్టీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూకుడు పెంచిన సంగ‌తి తెలిసిందే. మ‌రో ప‌క్క మ‌హాకూట‌మి అభ్య‌ర్థుల జాబితా వెల్ల‌డిపై త‌ర్జనాబ‌ర్జ‌నా ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో మ‌రో రెండు రోజుల్లో మ‌హాకూట‌మి నుంచి పోటీ చేయ‌నున్న ఎమ్మెల్యే అభ్య‌ర్థుల జాబితాను విడుద‌ల చేయ‌నున్నార‌ని సోష‌ల్ మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డుతున్న త‌రుణంలో.. అందులో భాగంగానే సోనియా గాంధీ తెలంగాన‌లో ప‌ర్య‌టించ‌నున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సోనియా గాంధీ రెండు రోజుల‌పాటు హైద‌రాబాద్‌లోనే బ‌స చేయ‌నున్నారు. అంతేకాకుండా, పార్టీ ముఖ్య నేత‌ల‌తోపాటు, మ‌హాకూట‌మిలోని ముఖ్ య‌నాయ‌కుల‌తో క‌లిసి సోనియాగాంధీ ఎన్నిక‌ల‌పై చ‌ర్చించ‌నున్నారు. న‌ల్గొండ‌, రంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్, నిజామాబాద్ వంటి కాంగ్రెస్‌కు ప‌ట్టున్న జిల్లాల్లో బ‌హిరంగ స‌భ‌ల‌ను నిర్వ‌హించేందుకు Congress ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసింది.

Related News