//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మృతి...!

Category : politics

ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత బేగం హమీదా హబీబుల్లా మంగళవారంనాడు తన నివాసంలో తీవ్రమైన అస్వస్థతకు లోనయ్యాయి అక్కడే కన్నుమూశారు. ఆమె వయస్సు 102 సంవత్సరాలు.

ఈమె రాజ్యసభ మాజీ సభ్యురాలు. ఈమె హబీబుల్లా హైదరాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ దివంగత నవాబ్ నజీర్ జంగ్ బహదూర్ కూతురు. పుణెలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఫౌండర్ కమాండెంట్ జనరల్ ఇనయత్ హబీబుల్లాను బేగం హమీదా పెళ్లి చేసుకున్నారు. వారి కుమారు వజాహత్ హబీబుల్లా భారత తొలి చీఫ్ ఇన్‌ఫర్మేషన్ కమిషనర్‌గా పనిచేశారు.

1965 లో భర్త ఆర్మీ నుంచి రిటైర్ అయ్యారు. ఆ తరువాత ఆమె రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్‌లో చేరారు. హైదర్‌గఢ్ నుంచి మొదటగా ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డారు. ఆమె 1971 నుంచి 1973 వరకూ హరిజన సంక్షేమం, జాతీయ సమైక్యత, సివిల్ డిఫెన్స్ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత టూరిజం మినిస్టర్‌గా కూడా ఉన్నారు.

అనంతరం యూపీ కాంగ్రెస్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా 1980 వరకూ ఉన్నారు. 1969 నుంచి ఏఐసీసీ సభ్యురాలిగా కూడా ఆమె ఎన్నికయ్యారు. యూపీసీసీ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సేవలందించారు. 1976 నుంచి 1982 వరకూ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. మహిళా సాధికరతపై తరచు గళం వినిపించే నేతగా బేగం హబీబుల్లాకు పేరుంది.

1975లో అవద్ గాళ్స్ డిగ్రీ కాలేజీ ప్రెసిడెంట్‌గా కూడా ఉన్నారు. కాగా, సుదీర్ఘ అస్వస్థతతో కన్నుమూసిన బేగం హబీబుల్లా అంత్యక్రియలు బారాబంకీలోని ఆమె స్వగ్రామంలో ఇవాళ జరుగుతున్నాయి.