//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

5 గంటలకు గవర్నర్‌ తో భేటీకానున్న కాంగ్రెస్-జేడీఎస్...!

Category : politics

కర్ణాటక ఫలితాల అనంతరం ప్రభుత్వం ఏర్పాటుకు తమకే అవకాశమివ్వాలంటూ అటు పెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ, తమ కూటమికే సంఖ్యాబలం ఉన్నందున తమనే ఆహ్వానించాలని జేడీఎస్-కాంగ్రెస్ కూటమి క్లెయిమ్ చేస్తుండటంతో ఉత్కంఠ కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు గవర్నర్ బాజూభాయ్ వాలాను జేడీఎస్, కాంగ్రెస్ ప్రతినిధి బృందం కలవనుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మీడియాకు వెల్లడించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి గవర్నర్ ఆహ్వానం కోసం ఎదురుచూస్తున్నామని, జేడీఎస్ పార్టీ లెజిస్లేచర్ నేత, కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ నేత ఎన్నికకు సంబంధించిన రెండు లేఖలను గవర్నర్‌కు సమర్పించనున్నామని చెప్పారు.

గవర్నర్ ఆహ్వానం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నామని చెప్పారు. కాగా, ఒకవేళ కాంగ్రెస్-జేడీఎస్‍ కూటమిని గవర్నర్ ఆహ్వానించని పక్షంలో ఆ పార్టీల ఎమ్మెల్యేలంతా గురువారం రాజ్‌భవన్ వెలుపల బైఠాయింపు ధర్నా జరపాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రతిపాదిత ధర్నాలో ఎంపీలు సైతం పాల్గోనున్నారు.