//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సొంత పార్టీ నేతలకు బిగ్ షాక్ ఇచ్చిన కాంగ్రెస్ హై కమాండ్ ... రీజన్ ఇదే

Category : politics

కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ నేతలకు ఝలక్ ఇచ్చింది. వారికి గట్టి షాక్ ఇచ్చింది. అధిష్టానం ఒక కుటుంబానికి ఒక టికెట్ ఫార్ములా అమలు చెయ్యటంతో సీనియర్ నాయకులను నిరాశకు గురి చేసింది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఒక కుటుంబంలోంచి ఒకరికే టికెట్ ఇవ్వాలనే పార్టీ అధిష్టానం ఫార్ములా తెలంగాణ సీనియర్ Congress నేతలకు పలువురికి రుచించటం లేదు. ఒన్ ఫ్యామిలీ ఒన్ టికెట్ అనే ఫార్ములాను ముందుకు తేవడం ద్వారా Congress అధిష్టానం తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకురావాలనుకున్నారు. కానే ఆ నేతల ప్రయత్నాలకు గండి కొట్టిన అధిష్టానం షాక్ ఇచ్చింది.

ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీని Congress సీనియర్ నేతలు రెండో టికెట్ విషయంలో ప్రసన్నం చేసుకోలేక పోయారు. రాహుల్ గాంధీని కలిసినప్పటికీ జానా రెడ్డి తన కుమారుడికి టికెట్ ఇప్పించుకోవడంలో విఫలమయ్యారు. జానారెడ్డి నాగార్జునసాగర్ సీటు నుంచి పోటీ చేస్తుండగా ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డికి మిర్యాలగూడా సీటు కావాలని అడిగారు. ఓ సమయంలో నాగార్జున సాగర్ లో తన కుమారుడిని పోటీకి దించి తాను మిర్యాలగూడా నుంచి పోటీ చేయాలని కూడా ఆయన ఓ సమయంలో అనుకున్నారు. మొతానికి నాగర్జున సాగర్, మిర్యాల గూడా సీట్లు కోరుకున్న జానా రెడ్డి ప్రయత్నాలు ఫలించలేదు. ఇక భూపాలపల్లి నుంచి పోటీ చేయనున్న గండ్ర వెంకటరమణా రెడ్డి తన భార్య జ్యోతికి టికెట్ అడిగారు. ఇక కొండా దంపతులు కూతురు సుస్మిత కోసం టికెట్ ఆశించారు.పొన్నాల లక్ష్మయ్య జనగామ నుంచి పోటీ చేయనుండగా తన కోడలికి కూడా టికెట్ ఆశించారు. గద్వాల నుంచి పోటీ చేస్తున్న డికె అరుణ తన కూతురు స్నిగ్ధా రెడ్డికి మహబూబ్ నగర్ సీటు ఆశించారు. మహేశ్వరం నుంచి పోటీ చేయనున్న సబితా ఇంద్రా రెడ్డి తన కుమారుడు కార్తిక్ రెడ్డికి రాజేంద్ర నగర్ సీటు అడిగారు.

మాజీ డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ తన భార్యకు సంగారెడ్డి టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గత ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి, ఆయన సతీమణి పద్మావతి కోదాడ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఉత్తమ్ కుటుంబాన్ని మాత్రం అధిష్టానం ఆ ఫార్ములా నుంచి మినహాయించినట్లు తెలుస్తోంది. అయితే ఆ స్థానం పొత్తులలో కూటమి పార్టీలకు వెళ్ళే అవకాశం వుంది. జహీరాబాద్ నుంచి పోటీ చేయనున్న మాజీ మంత్రి గీతా రెడ్డి తన కూతురు మేఘనా రెడ్డికి మెదక్ సీటు ఇవ్వాలని ప్రయత్నాలు సాగించారు. కానీ ఫలితం లేదు.

అలాగే,మల్లుభట్టి విక్రమార్క మథిర నుంచి పోటీ చేస్తుండగా, ఆయన సోదరుడు మల్లు రవి జడ్చర్ల నుంచి పోటీ చేయనున్నారు. నల్లగొండ నుంచి పోటీ చేయనున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మునుగోడు నుంచి పోటీకి దించే అవకాశాలున్నాయి. . ఇలా రాజకీయ వారసులను రంగంలో దించాలనుకున్న కాంగ్రెస్ సీనియర్లకు అధిష్టానం గట్టి దెబ్బే కొట్టింది.

Related News