//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్‌ మాజీ మంత్రి..!

Category : politics

జ‌ల‌గం ప్ర‌సాద‌రావు, ఒకప్పుడు కాంగ్రెస్‌లో సీనియ‌ర్ నేత‌. ఇప్ప‌టికీ ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో బ‌ల‌మైన రాజ‌కీయ నాయ‌కుడు. ఎంత బ‌ల‌మున్నా.. ఏం లాభం అన్న‌ట్టు మాజీ ముఖ్య‌మంత్రి కొడుకైనా.. మంత్రిగా ప‌నిచేసిన అనుభ‌వం ఉన్న ప్ర‌స్తుతం ఈ య‌న మాత్రం ఏ పార్టీలోనూ లేరు. కాంగ్రెస్‌లోకి రీ ఎంట్రీ ఇద్దామ‌న్నా ఎవ్వ‌రూ ఒప్పుకోవ‌డం లేదు.

జ‌ల‌గం ప్ర‌సాద‌రావు 18 ఏళ్ల కింద‌ట కాంగ్రెస్ నుంచి స‌స్పెన్ష‌న్‌కు గుర‌య్యారు. ఇప్ప‌టికీ తిరిగి పార్టీలోకి రాలేదు. వెళ్ల‌లేదు అనేకంటే.. జిల్లా నేత‌లు ఆయ‌న్ను రానీయ‌డం లేద‌న‌డం క‌రెక్ట్. అంత‌లా ఈయ‌న్ను అడ్డుకుంటున్నారు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత‌లు. స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యేగా మంత్రిగా ప‌నిచేశారు ప్ర‌సాద‌రావు. ఈయ‌న త‌మ్ముడు జ‌ల‌గం వెంక‌ట్రావు. కొత్త‌గూడెం తాజా, మాజీ ఎమ్మెల్యే మ‌రోసారి టీఆర్ఎస్ నుంచి బ‌రిలో ఉన్నారు. ప్ర‌సాద‌రావు మాత్రం 18 ఏళ్ల నుంచి కాంగ్రెస్‌లోకి తిరిగి వెళ్లేందుకు చెయ్య‌ని ప్ర‌య‌త్న‌మంటూ లేదు.

ప్ర‌తీ ఎన్నిక‌ల ముందు ఈయ‌న కాంగ్రెస్‌లోకి వ‌స్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఈ సారీ అదే జ‌రిగింది. ఇప్పుడు కొంచెం గ‌ట్టిగానే ప్ర‌య‌త్నించారు. ఢిల్లీ వెళ్లారు. అంతా ఓకే చేయించుకున్నారు. టీపీసీసీ కూడా ఈయ‌న‌పై స‌స్పెన్ష‌న్ నిర్ణ‌యాన్ని ఎత్తేస్తూ లేఖ‌ను కూడా ఏఐసీసీకి పంపింది.

కానీ, ఎప్పుడూ అడ్డుప‌డే నేత‌లు ఈ సారీ అడ్డు త‌గిలారు. జ‌ల‌గం ప్ర‌సాద‌రావును పార్టీలోకి తిరిగి తీసుకుంటే రాజీనామా చేస్తామంటూ ఢిల్లీ పెద్ద‌ల‌కే తేల్చి చెప్పారు. దీంతో కాంగ్రెస్ హైక‌మాండ్ కూడా ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి. జ‌ల‌గం ప్ర‌సాద‌రావుకు స‌త్తుప‌ల్లి, అశ్వ‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గాల్లో మంచి ప‌ట్టుంది. పాలేరులోనూ పోటీకి సిద్ధ‌ప‌డ్డారు. అయినా, జిల్లా కాంగ్రెస్ నేత‌లు అడ్డుకోవ‌డంతో విసిగిపోయిన ప్ర‌సాద‌రావు మ‌రో నిర్ణ‌యం తీసుకున్నారు. టీఆర్ఎస్ అధిష్టానం జ‌ల‌గం ప్ర‌సాద‌రావును పార్టీలోకి తీసుకురావాల‌ని ఆలోచించింద‌ట‌. అందుకు ఈయ‌న కూడా సుముఖంగా ఉండ‌టంతో ఇక చేరిక మాత్ర‌మే మిగిలి ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ప్ర‌సాద‌రావు గులాబీతీర్థం పుచ్చుకుంటే క‌చ్చితంగా పార్టీ జిల్లాలో మ‌రింత బ‌లోపేతం అవుతుంద‌ని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి.

Related News