//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైసీపీలోకి మాజీ మంత్రి.. డేట్ ఫిక్స్‌..!

Category : politics

కాంగ్రెస్ నేత మాజీ మంత్రి సీ.రామ‌చంద్ర‌య్య వైఎస్ఆర్ కాంగ్రెస్ గూటికి చేర‌బోతున్నారు. ఈ నెల 13వ తేదీన బొబ్బిలిలో వైసీపీ అధినేత జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేర‌నున్నారు. అయితే, ప్ర‌జా రాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయ్యాక సీ.రామ‌చంద్ర‌య్య‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ద‌క్కింది. అంతేకాకుండా, సీ.రామ‌చంద్ర‌య్య గ‌తంలో రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కూడా ప‌నిచేశారు. సీ.రామ‌చంద్ర‌య్య చేరిక‌తో క‌డ‌ప జిల్లా వైసీపీకి మ‌రింత బ‌లం చేకూరుతుంద‌ని ఆ పార్టీ నేత‌లు భావిస్తున్నారు. Former Minister C Ramachandraiah Quits Congress

మ‌రో వైపు కోడిక‌త్తి గాయంతో పాద‌యాత్ర‌కు దూరంగా ఉన్న వైసీపీ అధినేత జ‌గ‌న్ ఎల్లుండి నుంచి తిరిగి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను ప్రారంభించ‌నున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో దాడికి ముందు ఆయ‌న గ‌త నెల 25న సాలూరు నియోజ‌క‌వ‌ర్గం పాయ‌క‌పాడు వ‌ద్ద పాద‌యాత్ర ముగించారు. రేపు సాయంత్రం హైద‌రాబాద్ నుంచి విశాఖ‌ప‌ట్నం వెళ్లి.. అక్క‌డ్నుంచి నేరుగా విజ‌య‌న‌గ‌రం జిల్లా సాలూరు నియోజ‌క‌వ‌ర్గం పాయ‌క‌పాడులో రాత్రి బ‌స చేస్తారు. 294 రోజుల‌పాటు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర చేసిన జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు 3,200 కిలోమీట‌ర్ల‌కు పైగా పాద‌యాత్ర చేశారు. Former Minister C Ramachandraiah Quits Congress

అయితే, గ‌త మూడు రోజులుగా సీ.రామ‌చంద్ర‌య్య వైసీపీలో చేరిక‌పై చ‌ర్చ‌లు జ‌రుగాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. దీనికి సంబంధించి సీ.రామ‌చంద్ర‌య్య మీడియాతో మాట్లాడుతూ తాను ప్ర‌స్తుతం బెంగ‌ళూరులో ఉన్నాన‌ని, అక్క‌డ్నుంచి నేరుగా విశాఖ‌కు చేరుకుని జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ చేరుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇదిలా ఉండగా , వైఎస్ జ‌గ‌న్ రేపు సాయంత్ర 7 గంట‌ల 55 నిమిషాల‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి విశాఖ‌కు చేరుకున్నారు.Former Minister C Ramachandraiah Quits Congress

Related News