//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అలిగిన సీపీఐ .. బుజ్జగించే పనిలో కాంగ్రెస్

Category : politics

Congress నేతృత్వంలోని ప్రజా కూటమికి బీటలు వారే సూచనలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ కోరుకున్నది జరిగే అవకాశం కనిపిస్తుంది. సీట్ల సర్దుబాటులో ఎవరి ప్రాధాన్యతలు వారికున్నాయి. ఈ నేపధ్యంలోనే కూటమి లోని పార్టీలు సీట్ల విషయంలో సర్దుకోలేకపోతున్నాయి. Congress convincing CPI demands

రోజులు గడుస్తున్నా సీట్ల సర్దుబాటు కొలిక్కి రావడం లేదు. తెలంగాణ ప్రజా సమితి సిపిఐ Congress ఇవ్వజూపిన సీట్లకు ససేమిరా అంటున్నాయి. తమ ప్రాధాన్యతలు చెప్పి అక్కడే ఇవ్వాలని, తాము అడిగినన్ని సీట్లు ఇవ్వాలని కోరుతున్నాయి. మరో వైపు Congress లో ఆశావహులు రాజీనామాలకు సిద్ధంగా వున్నారు. ఇప్పటికే ఆందోళనల పర్వం ఊపందుకుంది. Congress convincing CPI demands

ప్రస్తుతం సిపిఐ నేతలు Congress తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కేవలం 3 సీట్లు తమకు ఇస్తామని Congress చెప్పడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సీట్ల పంపకంపై కాంగ్రెస్ నేతలు లీకులు ఇస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మండిపడ్డారు.దాంతో సిపిఐ,Congressల మధ్య పొత్తులో ప్రతిష్టంభన ఏర్పడింది. కూటమి నుంచి తప్పుకునేందుకు సిపిఐ సిద్ధపడింది. దాంతో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సిపిఐ నేతలను చర్చలకు ఆహ్వానించారు.Congress convincing CPI demands

సిపిఐ నేతలకు ఆయన ఫోన్ చేసి చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. అడిగినన్ని సీట్లు ఇవ్వకపోతే ఒంటరిగా పోటీ చేస్తామని సిపిఐ హెచ్చరించింది. Congress నిర్ణయం కోసం సోమవారం సాయంత్రం 4 గంటల వరకు వేచి చూడాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే ఉత్తమ్ సిపిఐ నేతలకు ఫోన్ చేశారు. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని కోరారు. సర్దుకుపోయే ధోరణి పార్టీలలో కనిపించటం లేదు. అలాగే వేల సంఖ్యలో టికెట్ ఆశించిన వారు ఇప్పుడు వూరుకునేలా లేరు. అంతా గందరగోళ వాతావరణం మధ్య ఇంకా సయోధ్యకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి సీపీఐ, టీజేఎస్ లు శాంతిస్తాయో లేదో తెలియాల్సి వుంది. Congress convincing CPI demands

Related News