//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాంగ్రెస్ తొలి జాబితాలో బీసీలకు అన్యాయం... 17న బంద్ కు పిలుపు

Category : politics

Congress party అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించింది. ఈ రోజు జాబితా ప్రకటించాలని భావించినా నాటకీయ పరిణామాల మధ్య హాదావిడిగా నిన్న రాత్రి జాబితా వెలువరించింది. జాబితా చూసి చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బీసీలు . .కాంగ్రెస్ పార్టీ సోమవారం రాత్రి 65 అభ్యర్థులను ప్రకటించింది.ఈ అభ్యర్థుల్లో కేవలం 13 మంది బీసీలకు మాత్రమే టికెట్లు కేటాయించారు.

Congress లో బీసీ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. బీసీలకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నెల 17వ తేదీన తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తున్నట్టు ఆయన ప్రకటించారు.బీసీలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని ఆర్. కృష్ణయ్య విమర్శించారు.Congress పార్టీలోని బీసీ అభ్యర్థులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టాన తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అభ్యర్థుల జాబితా తయారీలో సమన్యాయం పాటించలేదని ఫైర్ అయ్యారు.

Congress పార్టీ‌పై ఒత్తిడి తెచ్చేందుకు గాను ఈ నెల 17వ తేదీన తెలంగాణ బంద్‌ నిర్వహిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. మిగిలిన స్థానాల్లోనైనా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేసిన ఆయన బంద్ కు పిలుపునిచ్చి సంచలన ప్రకటన చేశారు.

Related News