Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అద్దంకి ఎవ్వరిది నీదా నాదా అంటూ పోటీ పడుతున్న టీడీపీ ప్రత్యర్థులు

Category : politics

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అక్కడ పార్టీల్లోనూ రోజురోజు కు సమీకరణాలు మారుతున్నాయి. అప్పుడు ఒక నియోజకవర్గం నుంచి పోటీచేసిన నాయకులూ ఇప్పడు వేరొక నియోజకవర్గం నుచి పోటీ చేస్తుంటారు. ఇప్పుడు అలాంటి సంఘటనే ఆంధ్రప్రదేశ్ లోని అధికార టీడీపీ లో జరగనున్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాలలో ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం ఒకటి. ఒకప్పటి టీడీపీ కంచుకోట ఆయన అంద్దంకి గత రెండు పర్యాయాలుగా కాంగ్రెస్, వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చాయి. గొట్టిపాటి రవి కుమార్ గత రెండు పర్యాయాలుగా అద్దంకి నియోజకవర్గం నుంచి పోటీ చేసి కరణం బలరాం వారసుడు కరణం వెంకటేష్ ఫై విజయం సాధించారు. గత ఎన్నికలలో వైస్సార్సీపీ తరుపున పోటీచేసి గెలిపొందిన గొట్టిపాటి రవికుమార్ తరువాత అధికార టీడీపీ పార్టీ లోకి చేరారు. మొన్నటివరకు వేరువేరు పార్టీలో ఉన్న ఈ ప్రత్యర్థులు ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు.వీరిద్దరూ నియోజక వర్గం మీద పట్టు కోసం నువ్వా నేనా అంటూ పోటీపడుతున్నారు. పార్టీలు ఒక్కటే ఆయన తాము మాత్రం వేరని ఈ ఇరువురు నేతలు చెప్పుకొస్తున్నారు. అయితే అక్కడి ప్రజలు ప్రత్యర్థులు ఒకే పార్టీకి చెందిన వారైనా నియోజకవర్గంలో అభివృద్ధి ఏ మాత్రం చేయటం లేదని అనుకుంటున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే 2019 ఎన్నికల సమయం దెగ్గర పడుతుండటం తో అద్దంకి నియోజకవర్గం లో ఏ నాయుడుకి టికెట్ ఇవ్వాలో తెలియక టీడీపీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఈ విషయం చంద్రబాబు వద్దకు వెళ్ళింది. అయితే కరణం వెంకటేష్ మాత్రం అద్దంకి నియోజకవర్గాన్ని వీడే ప్రసక్తే లేదని, నేను ఇక్కడనుండే పోటీచేస్తానని ఖరాకండిగా చెప్పేసాడు. దీనితో గొట్టిపాటి రవికుమార్ ని వేరొక నియోజక వర్గం లోకి మార్చాలని అధికార టీడీపీ పెద్దలు అనుకున్నట్లు సమాచారం. కానీ రవి అద్దంకి నియోజకవర్గం లో ఎప్పుడు పోటీచేసిన గెలిచే విధంగా క్యాడర్ ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ తాజా పరిణామాల దృష్ట్యా రవి చిలుకలూరి పేట నియోజకవర్గం నుంచి పోటీ చేయటకు అంగీకరించాడని సమాచారం. చిలుకలూరి పేట నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ను ఎంపీ గా పోటీ చేయిచాలని అధికార టీడీపీ పెద్దలు ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. చూదాం అసలు విషయం మనకు తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాలసిందే.