కార్ల తయారీలో రెండో అతిపెద్ద సంస్థ హ్యుందాయ్ మోటార్స్‌కు కాంపిటేషన్ కమీషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) షాకిచ్చింది. ప్యాసింజర్ కార్లపై రాయితీలు ఇచ్చే విషయంపై ఇష్టంవచ్చినట్లు వ్యవహరించినందుకుగాను సీసీఐ రూ.87 కోట్ల జరిమానా విధించింది. ఈ జరిమానాపై హ్యుందాయ్ వర్గాలు స్పందించాయి. దీనిపై కోర్టుకు వెళ్లనున్నట్లు ప్రకటించాయి. 2013-14 నుంచి మూడు ఆర్థిక సంవత్సరాల్లో కంపెనీకి వచ్చిన సరాసరి ఆదాయంపై 0.3 శాతం జరిమానాను సీసీఐ విధించింది.