భారత్కు చెందిన జీశాట్-17 ఉపగ్రహాన్ని ఫ్రెంచి గయానాలోని కౌర్ అంతరిక్ష కేంద్రం నుంచి గురువారం తెల్లవారుజామున ప్రయోగించారు. ఏరియన్-5 రాకెట్ దీనిని అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. సమాచార రంగంలో నెలకొన్న ట్రాన్స్ ఫాండర్ల కొరతను అధిగమించేందుకు ఈ ప్రయోగం ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది. 15 సంవత్సరాల పాటు చేసేలందించే ఈ ఉపగ్రహం బరువు 3,425 కిలోలు. దీనిలో మొత్తం 24 సీ ట్రాన్స్ ఫాండర్లు, 2 లోయర్ సీ బాండ్, 12 అప్పర్ సీ బాండ్, 2సీఎక్స్, 2ఎస్ఎక్స్ ట్రాన్స్ ఫాండర్లు ఉన్నాయి.