Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కామన్వెల్త్ గేమ్స్ లో భారత షట్లర్ల జోరు

Category : sports

ఆస్ట్రేలియా లోని గోల్డకోస్ట్ జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో చివరి రోజు భారత షట్లర్లు అదిరిపోయే అట తో ఆకట్టుకున్నారు. ఉమెన్స్ సింగిల్స్ గోల్డ్ మెడల్ కోసం పోటీ పడ్డ భారత స్టార్ షట్లర్లలో చివరికి సైనా నే గెలిచింది.

ఆద్యతం హోరాహోరీగా జరిగిన పోరాటంలో సైనా అద్భుతమైన పోరాటంతో అలరించింది, సింధును 21-18, 23-21 తేడాతో వరుస గేమ్ లను గెలిచి గోల్డ్ మెడల్ ను అందుకుంది. మ్యాచ్ ఆసాంతం నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ పోరులో సైనా ఆటతీరు ఆకట్టుకుంది. అలాగే భారత ఖాతాలో 26 వ పసిడి పతకం చేర్చింది.

ఇంకా మరో పక్క మెన్స్ సింగిల్స్ ఫైనల్స్ లో వరల్డ్ నెంబర్ వన్ కిదాంబి శ్రీకాంత్ కు గోల్డ్ మిస్సింది. మలేషియన్ వెటరన్ లీ చొంగ్ వీ తో పోటీ పడ్డ కిదాంబి చివరి వరకు పోరాడి ఓటమి పాలయ్యాడు. మూడు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో శ్రీకాంత్ 21-19, 14-21, 14-21 తేడాతో ఓడి రజతం సాధించాడు.

మొత్తానికి ఈ కామన్వెల్త్ గేమ్స్ లో భారత షట్లర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ఆడిన అన్ని విభాగాల్లోనూ పతకాల గెలిచి భారత పతాకాన్ని రెపరెపలాడించారు.