//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కోదాడ నుండి బరిలోకి దిగనున్న వేణుమాధవ్..!

Category : politics

టాలీవుడ్ ప్రముఖ సినీ హాస్య నటుడు వేణుమాధవ్ ప్రస్తుతం తెలంగాణ లో జరుగుతున్న ఎలెక్షన్స్ లో పోటీ చేయబోతున్నట్లు సమాచారం . ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాకి వెల్లడించారు . గురువారం ఉదయం 11 గంటలకు తన నామినేషన్ స్వయంగా వేయనున్నట్లు తెలిపాడు . వేణుమాధవ్ సొంతూరు కోదాడ. ఈయన అక్కడే చదువు పూర్తి చేసుకొని , ఆ తరువాత మొదట్లో మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టారు. ఆ తరువాత టీడీపీ పార్టీ ఆవిర్భవించడంతో ఆ పార్టీ సభల్లో పాల్గొని తన మిమిక్రీ ద్వారా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. అక్కడినుండి సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి , స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. Comedian Venu Madhav Nomination kodada Constituency

వేణుమాధవ్ టీడీపీకి వీరాభిమాని . అలాగే సీఎం నారా చంద్రబాబు నాయుడుతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. దీంతో ఆయన టీడీపీ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తారనుకుంటే అనూహ్యంగా కోదాడ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా ఈరోజు నామినేషన్ వేయనున్నారు.Comedian Venu Madhav Nomination kodada Constituency

కమెడియన్ గా కొన్ని వందల చిత్రాల్లో నటించిన వేణుమాధవ్ రాజకీయ నేపధ్యం గల కుటుంబానికి చెందినవారే. తన నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు .Comedian Venu Madhav Nomination kodada Constituency

Related News