Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మహేష్ పై కమెడియన్‌ సంచలన వ్యాఖ్యలు ...నడిఘర్ సంఘానికి 'మా' లేఖ....!

Category : movies

తమిళ్ లో స్టాండప్ కమెడియన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ ప్రభాకర్, టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు గురించి ఇష్టారీతిలో కామెంట్లు చేయటంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. రెండు రాళ్లను చూపిస్తూ సినిమాల్లో మహేష్ బాబు హావభావాలు ఇలా ఉంటాయని వ్యాఖ్యానిస్తూ, మహేష్ బాబు ఎక్స్‌ప్రెషన్స్ అచ్చం కత్రినా కైఫ్‌లా ఉంటాయని, మహేష్ బాబు.. కత్రినా కైఫ్ మేల్ వెర్షన్ అని అనడం సౌత్ ఇండియన్ సినీ వర్గాల్లో చర్చలకు దారి తీసింది.

ఈ విషయమై తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ , నడిఘర్ సంఘానికి లేఖ రాసింది. మహేష్ బాబుపై ఇలా ఇష్టారీతిలో కామెంట్స్ చేసిన సదరు వ్యక్తిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొంది.కమెడియన్ మనోజ్ ప్రభాకర్ వ్యాఖ్యలు విని షాకయ్యామని, మహేశ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలను 'మా' తీవ్రంగా ఖండిస్తోందని 'మా' లేఖలో పేర్కొంది.

మద్రాసులో తెలుగు, తమిళ ఇండస్ట్రీలు ఉన్నప్పట్నుంచి నేటికీ ఇరు ఇండస్ట్రీల మధ్య దశాబ్దాలుగా స్నేహపూర్వక వాతావరణం కొనసాగుతోందని, ఇలాంటి తరుణంలో కమెడియన్‌గా ఉన్న ప్రభాకర్ ఇలా తెలుగు హీరోపై చేసిన అనుచిత వ్యాఖ్యలు మహేశ్ అభిమానులనే కాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీకి ఆగ్రహాన్ని తెప్పించాయని తెలిపింది. ఈ వ్యవహారంపై నడిఘర్ సంఘం వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఈ లేఖ ద్వారా కోరింది 'మా'.