//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ ... ఆలీనా మజాకా

Category : state politics

ఇప్పుడు ఏపి లో ఆలీ రాజకీయాలు హాట్ టాపిక్. ఆలీ ని కమెడియన్ అని కామెడీ గా తీసుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇంతకాలం టిడిపి సానుభూతిపరుడు గా టిడిపి కార్యక్రమాల్లో భాగస్వామ్యం తీసుకున్న ఆలీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రిపేర్ అయిపోయాడు. తనకు ఎవరు టికెట్ ఇస్తే ఆ పార్టీలో చేరుతారనేది రాజకీయాల్లోకి కొత్తగా వచ్చే ఎవరైనా చెప్పే అంశం. కానీ అలీ కాస్త డిఫరెంట్ గా నాకు టికెట్ ఇవ్వడం తో పాటుగా మంత్రి పదవికి హామీ ఇస్తేనే పార్టీ తీర్థం పుచ్చుకుంటారని చెప్పడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఈ విషయంలో ప్రధాన పార్టీలైన టీడీపీ దగ్గర, అలాగే వైసిపి దగ్గర ఆలీ తన డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక అత్యంత సన్నిహితుడైన జనసేన అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ తన పార్టీ నుండి పోటీ చేయమని అడిగినప్పటికీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి మంత్రి పదవి దక్కదు అన్న ఆలోచనతో జనసేన లో చేరడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదట ఆలి. ప్రధానంగా మళ్లీ అధికారంలోకి టీడీపీ ని వస్తుందన్న భావన లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే తనను సిఫారసు చేయమని గంటా శ్రీనివాసరావు ని కలిసి ఆలీ తన డిమాండ్స్ ను తెలియజేశారు.

ఇంతవరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా, ఒక్కసారి కూడా పోటీ చేయకుండా, ఒకసారైనా ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం లేకుండా ఏకంగా మంత్రి పదవికే టెండర్ పెట్టాడంటే ఆలీ మామూలోడు కాదు అంటున్నారు ఏపీ ప్రజలు.

ఇంతకీ ఏపీలో ఆలీ అసలు పోటీ చేస్తే విజయవకాశాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఒకరకంగా ప్రశ్నార్థకమే. అలాంటి పరిస్థితుల్లో ఇక ఏకంగా మంత్రి పదవికే టెండర్ పెడుతున్న ఆలీ రాజకీయ ప్రస్థానం ఏ విధంగా సాగుతుంది.. ఎవరు ఆలీకి ఆయన డిమాండ్స్ ను అంగీకరించే అవకాశం ఇస్తారు అనేది వేచి చూడాల్సిందే. మొత్తానికి సినిమాల్లో కామెడీ పండించిన అలీ రియల్ లైఫ్ లో మాత్రం పొలిటిషియన్ లను మించిపోయి తానేంటో చూపించాడు ...ఆలీనా మజాకా...

Related News