//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాజకీయాల్లోకి వస్తారా అంటే..

Category : movies editorial

సిని నటులు రాజకీయాల్లోకి రావడం సర్వసాధారణంగా మారిపోయింది. ఇప్పటికే తమిళనాడులో ఇటీవల సూపర్ స్టార్ రజని కాంత్.. విశ్వ నటుడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చి సత్తా చాటాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఒకరు పార్టీ పేరు కూడా ప్రకటించారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలను వదిలి రాజకీయాలు చెయ్యాలని రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. అయితే వీరిలో ఎవరు విజయం సాదిస్తారు అనేది ఎన్నికలు వచ్చే వరకు చెప్పలేని పరిస్థితి.

ఇదిలా ఉంటె లెజెండ్ సినిమాతో సినిమాల్లో ఫాం లోకి వచ్చిన జగపతి బాబు ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన రాజకీయాల్లోకి కూడా వస్తారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజాలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ గతంలో కొందరు రాజకీయాల్లోకి ఆహ్వానించారని, అయితే తనకు అలాంటి ఆలోచనలేదని.. తాను ఎప్పటికీ రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు. కాగా జగపతి బాబు విలన్ గా నటించిన రంగస్థలం సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.