//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సినిమాలకు దూరం అవుతున్న కలర్స్ స్వాతి: కారణం ఇదే...

Category : movies

కలర్స్ అంటూ బుల్లి తెర మీద అడుగుపెట్టి ఎంతో క్రేజ్ తెచ్చుకున్న నటి స్వాతి, అలియాస్ కలర్స్ స్వాతి. తరువాత డేంజర్ మూవీ తో వెండి తెరకు పరిచయమై, అష్టాచెమ్మా మూవీ లో హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది.స్వాతి సెట్స్ లో అందరితో ఎంతో సరదాగా ఉంటూ తన మాటలతో అందరిని తెగ నవ్విస్తుందంట.

స్వామి రా రా మూవీ స్వాతి కెరీర్ కి మంచి ప్లస్ పాంట్. ఆ తరువాత వచ్చిన కార్తెకేయ మూవీ హిట్ తో టాలీవుడ్ లోని అగ్ర కదనాయకాల సరసన చేరింది ఈ అమ్మడు. వరస సినిమాలతో దూసుకుపోతున్న స్వాతి ఇప్పుడు సినిమాలకు దూరమవుతుందని తాజా సమాచారం.

దాని కారణం ఈ అమ్మడు పెళ్లి చేసుకోబోతుందంట. ఆగస్ట్ 30 న ఆమె వివాహం హైదరాబాద్ లో జరగనుందని సమాచారం. ఆమెకి కాబోయే భర్త పేరు వికాస్ ని అతను ఒక ఇంటర్నేషనల్ పైలట్ అని సమాచారం. ఇప్పుడు వీరిద్దరూ దిగిన ఫోటో సోషల్ మీడియా లో తెగ చెక్కర్లు కొడుతున్నాయి. చూద్దాం పెళ్లి తరువాత కూడా ఈ అమ్మడు సినిమాలో నటిస్తుందో లేదో...