//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

Category : business

బడ్జెట్ తర్వాత దారుణంగా దెబ్బతిన్న స్టాక్ మర్కెట్స్ ఇవాళ కూడా ఊహించని స్థాయిలో కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లు నష్టాలను చవిచూస్తుండడంతో ఆ ప్రభావం కూడా భారత మార్కెట్లను కోలుకోలేని దెబ్బతీసింది.

దీంతో ట్రేడింగ్ ఆరంభంలోనే సెన్సెక్స్ 1300 పాయింట్లు కోల్పోగా ఎన్ఎస్‌ఈ నిఫ్టీ కూడా 290.05 పాయింట్లు కోల్పోగా 10,376.50 వద్ద ట్రేడయింది. దీని ఫలితంగా ఓపెనింగ్‌లోనే మదుపరుల సంపద సెకన్ల వ్యవధిలో రూ.5.4 లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది.

ఒకానొకస్థాయిలో 1300 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్... 33,482.81 వద్దకు చేరింది. తర్వాత కొద్దిగా కోలుకుని ప్రస్తుతం 1048.73 పాయింట్ల నష్టంతో 33,708.43 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ మాత్రం 327.10 పాయింట్ల మేర మరింత పతనమై 10,339.45 వద్ద తచ్చాడుతోంది.

అమెరికా క్రెడిట్ రేట్లను తగ్గించడం అక్కడి మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపించగా ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచే అవకాశాలుండడంతో వాట్‌స్ట్రీట్ మార్కెట్‌కు లాభాల స్వీకరణ ఒత్తిడి పెరిగింది. దీంతో ఆసియా మార్కెట్ సూచీలు కూడా వేగంగా స్పందించాయి. దాదాపు 4 శాతం మేర పతనమయ్యాయి.