బడ్జెట్లో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఇచ్చిన షాక్‌తో, స్టాక్‌మార్కెట్లు ఢమాలమన్నాయి. లక్షకు పైగా పెట్టుబడులుపై 10 శాతం ఎల్టీసీజీ ను విధించనున్నట్టు ప్రకటించడంతో, స్టాక్‌మార్కెట్లు తీవ్ర నష్టాల్లోకి వెళ్లాయి.
సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్లు కిందకి పడిపోయింది. ప్రస్తుతం కొంత కోలుకుని 56 పాయింట్ల నష్టంలో 35,908 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ కూడా ఆ ప్రకటనతో 119 పాయింట్లు నష్టపోయింది. ప్రస్తుతం 20 పాయింట్ల నష్టంలో 11,007 వద్ద ట్రేడవుతోంది.
మరోవైపు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను 15 శాతంగానే కొనసాగనున్నట్టు పేర్కొన్నారు. ఎల్టీసీజీ విధింపుపై ఇన్వెస్టర్లు తీవ్ర నిరాశ వ్యక్తంచేశారు. జైట్లీ ప్రసంగిస్తుండగానే మార్కెట్లు కుప్పకూలాయి. భారీ పరిశ్రమలకు కూడా కార్పొరేట్ పన్నులపై ఎలాంటి మినహాయింపులు ఇవ్వకపోవడం కూడా పారిశ్రామిక వర్గాలను నిరాశపరిచింది.