Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కొబ్బరి బొండాలు తాగుతున్నారా..తస్మాత్ జాగ్రత్త

Category : national editorial

అబ్బ ఎండలు చంపేస్తున్నాయ్ బాబూ అనుకుంటూ కనబడ్డ పెతి కొబ్బరి బోండాం తాగేయకండి..ఇదేటి ఇట్టా చెబుతున్నారనుకుంటున్నారా మరి చూడండీసిత్రం...

ఇప్పటికే కూరగాయలు, మావిడికాయలు, అరటికాయలు, జామకాయలు ఇలా పెతీదాన్ని తెగ మాగబెట్టేత్తున్న ఈ కార్బైడ్ గాళ్లు..ఇప్పడు తాజా లేటెస్టుగా..కాన్ సన్ ట్రేసనంతా..అదేనండీ బావూ యాపారమంతా..బోండాలమీదనే ఎట్టారట..ఇదెలా సేత్తారో తెలుసా..కొబ్బరి చెట్టు మొదట్లో ఉండే తల్లియేరును బైటికి లాగేసి..దానికి మోనోక్రోటోపాస్ మందు పోసేత్తారంట..ఇగ ఆ తర్వాత చెప్పేదేవుంది..తొందర తొందరగా..పిందెలు బొండాలవడం..తొందర తొందరగా బోండాలు పెద్దవి కావడం యెంట యెంటనే జరిగిపోతాయంట..మరి ఇట్టాంటి బొండాల్లో నీళ్లుంటాయో లేదో తెలీదుగానీ..తాగినోడికి మాత్తరం అన్ని జబ్బుల్లానే కిడినీలు..లివరు పాడైపోడం లాంటి యెగస్ట్రా బోనసులన్నీ వచ్చేత్తాయంట..మరి సేసేదేవుంది..దేవుడిపై బారం యేసేసి తాగడవే..ఛస్...యెదవ బతుకైపోనాది..నీల్లు ఇసం, పాలు ఇసం, కూరగాయలు ఇసం గాలి ఇసం..తినే తిండి ఇసం..మరేటి సేసేదు లేదు..అందుకే బతికినన్ని రోజులూ బెమ్మాండంగా ఇసం లేని నవ్వేసుకుంటూ..బతికేద్దాం..ఓకేనా మరి కామెంటింగ్ సేయడం మాత్రం మానొద్దు..బాయ్....