//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మావోయిస్టుల‌పై విరుచుకుపడనున్న కోబ్రా క‌మాండోలు

Category : national

సుక్మా జిల్లాలో మావోయిస్టుల‌పై విరుచుకుప‌డేందుకు కోబ్రా క‌మాండోలు సిద్ధ‌మ‌వుతున్నాయి. చ‌త్తీస్‌గ‌డ్‌లోని సుక్మాతో పాటు స‌మీప ప్రాంతాల్లో మావోల‌ను ఎదుర్కొనేందుకు సుమారు రెండు వేల మంది కోబ్రా క‌మాండోలు అద‌నంగా రంగంలోకి దిగ‌నున్నారు. న‌క్స‌ల్స్‌తో గెరిల్లా యుద్ధానికి దిగిన సీఆర్‌పీఎఫ్ ప్ర‌త్యేకంగా క‌మాండోల‌ను ర‌ప్పిస్తున్న‌ది. కోబ్రా (క‌మాండో బెటాలియ‌న్ ఫ‌ర్ రిజ‌ల్యూట్ యాక్ష‌న్‌) ద‌ళాల‌ను పంపేందుకు బ్లూప్రింట్‌ను త‌యారు చేశారు. 20 నుంచి 25 కంపెనీల కోబ్రా ద‌ళాల‌ను సుక్మాకు పంపాల‌నుకుంటున్నారు. ప‌శ్చిమ బెంగాల్‌, బిహార్‌, తెలంగాణ, మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్రాంతాల్లో ఉన్న ఈ ద‌ళాల‌ను బ‌స్త‌ర్‌కు త‌ర‌లించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఒక్క కోబ్రా కంపెనీలో సుమారు వంద మంది సిబ్బంది ఉంటారు. కేవ‌లం ఇంటెలిజెన్స్ స‌మాచారం ఆధారంగా కోబ్రా ద‌ళాలు ఆప‌రేష‌న్ నిర్వ‌హిస్తాయి. భారీ న‌ష్టం జ‌ర‌గ‌కుండా కేవ‌లం న‌క్స‌ల్ ప్రాంతాల్లోనే ధ్వంసం చేస్తారు. ఇప్ప‌టికే సుక్మా, దంతెవాడ ప్రాంతాల్లో సుమారు 44 కంపెనీల కోబ్రా క‌మాండోలు విధులు నిర్వ‌ర్తిస్తున్నాయి.