//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సీఎంకి అస్వస్థత ఆసుపత్రికి తరలింపు !

Category : national

గత కొద్ది రోజులుగా తీవ్ర అస్వస్థతతో ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరిన పారికర్ గురువారమే డిశ్చార్జ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే.

అయితే ఇప్పుడు అనూహ్యంగా పారికర్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. పొత్తికడుపునొప్పితో బాధపడుతున్న పారికర్ ని నిన్న సాయంత్రం గోవా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ లో జాయిన్ చేర్చారు. ఈ విషయాన్ని గోవా ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణె ధ్రువీకరించారు. పారికర్ డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారని, ప్రస్తుతం చికిత్సకు స్పందిస్తున్నారని మంత్రి ప్రకటించారు. చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని, ప్రస్తుతం అబ్జర్వేషన్‌లో ఉన్నారని ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు.

నిపుణులైన వైద్యులు 24 గంటలూ సీఎంను పర్యవేక్షిస్తున్నట్టు రాణె మీడియా ముందు ప్రకటించారు. 62 ఏళ్ల పారికర్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. తీవ్ర అస్వస్థతతో ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరిన పారికర్ గురువారమే డిశ్చార్జ్ అయి ఆసుపత్రి నుంచి అసెంబ్లీకి నేరుగా వచ్చి తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టారు.