Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కేసీఆర్ తరహాలో కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తా అంటున్న జగన్... సాధ్యమేనా

Category : state politics

జగన్ కేసీఆర్ బాటలో నడవాలని కుంటున్నాడు. అందుకే ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం లోనూ, చేస్తున్న ప్రకటనల్లోనూ కెసిఆర్ తరహా విధానమే కనిపిస్తోంది. రాష్ట్రంలో తాను అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని 25 జిల్లాలుగా విభజన చేస్తానని జగన్ పాదయాత్ర ముగింపు సభలో ప్రజలకు హామీ ఇచ్చారు.

మొదటి కేసీఆర్ లాగా అభ్యర్థుల జంబో లిస్ట్ ప్రకటిస్తారనుకున్న నేపథ్యంలో అభ్యర్థుల ప్రకటన చేయలేదు కానీ ముగింపు సభలో మాత్రం జగన్ తనదైన శైలిలోఅచ్చు కేసీఆర్ లాంటి వ్యూహాన్ని వెల్లడించారు. చిన్న చిన్న జిల్లాలుగా ఏర్పాటు చేస్తే అభివృద్ధి త్వరితగతిన సాధ్యమవుతుందని తక్కువ పరిధిలో పరిపాలన ఉన్నప్పుడు అధికారులు బాగా పని చేస్తారని జగన్ కేసీఆర్ తరహా హామీ ఇచ్చారు.ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం కట్టిస్తానని చెప్పారు. ప్రతి గ్రామానికి పది మంది ఉద్యోగులను స్థానికుల నుంచి నియమిస్తానని చెప్పడం మరొక విశేషం.

పాదయాత్ర ముగిసిన సందర్భంగా ఇచ్చాపురం లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన జగన్ ఈ తరహా భవిష్యత్ ప్రణాళికలను ప్రకటించారు. అంతేకాకుండా తాము అధికారంలోకి వస్తే అన్నట్లుగా నవరత్నాలను కూడా అందిస్తానని జగన్ చెప్పుకొచ్చారు. కెసిఆర్ తెలంగాణలో జిల్లాలను విభజన చేసి లాభపడ్డారని భావించిన జగన్ తాను సైతం జిల్లాలను విభజన చేస్తానని చెప్పి సెన్సేషన్ క్రియేట్ చేశారు. అయితే తెలంగాణ మిగిలు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఏపీ లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం. లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో జగన్ చెప్పిన జిల్లాల విభజన జరిగితే ఆర్థిక భారం మరింత పెరిగి అప్పులపాలవుతారు తప్ప ఇంకా వేరే ఎలాంటి ప్రయోజనం ఉండదు. కెసిఆర్ ని ఫాలో అవ్వడం మంచిదేనా అది ఏపీలో ఆచరణ సాధ్యమా కాదా అన్నది చూసుకోవడం అంత ఇంపార్టెంట్.