//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్ .. ఎవరెవరంటే

Category : politics state

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 12 వ తేదీన ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజున కౌంటింగ్ జరుగుతోంది. మార్చి 15వ తేదీ వరకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.

తెలంగాణ రాష్ట్రంలోని ఐదు ఎమ్మెల్సీలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రకటించారు.

హోం శాఖ మంత్రి ఎండి మెహమూద్ అలీ, రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గే మల్లేశం కురుమ, ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ లను టిఆర్ఎస్ అభ్యర్థులుగా ఖరారు చేశారు. ఇక మరొక సీటును ఎంఐఎంకు కేటాయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

శాసనమండలిలో ఐదుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం ఈ ఏడాది మార్చి 29వ తేదీతో ముగియనుంది. పొంగులేటి సుధాకర్ రెడ్డి, షబ్బీర్ అలీ, సంతోష్ కుమార్, మహ్మద్ సలీం పదవీకాలం పూర్తి కానుంది.

తెలంగాణ అసెంబ్లీలో నామినేటేడ్ ఎమ్మెల్యేతో కలుపుకొంటే 120 మంది సభ్యులున్నారు. టీఆర్ఎస్‌కు 88 మంది ఎమ్మెల్యేలున్నారు. టీఆర్ఎస్ కు మరో ఇద్దరు ఇండిపెండెంట్ సభ్యులు మద్దతును ప్రకటించారు. టీఆర్ఎస్ కు మిత్రపక్షం ఎంఐఎంకు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం 97కు చేరుతోంది. ఒక్క ఎమ్మెల్సీ గెలుచుకోవాలంటే కనీసం 24 మంది ఎమ్మెల్యేల బలం అవసరం ఉంటుంది.కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు గెలుచుకోవాలంటే కనీసం 24 మంది ఎమ్మెల్యేలు అవసరం. కానీ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ కు టీడీపీ మద్దతిస్తే 21 మంది ఎమ్మెల్యేలు ఉంటారు.

అయితే ఈ లెక్కల ప్రకారం ఈ ఐదు ఎమ్మెల్సీ స్థానాలు కూడ మిత్రపక్షం తో కలుపుకొని, టీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఎక్కువ ఉంది.

ఇదిలా ఉంటే మరో మూడ ఎమ్మెల్సీ పదవులకు కూడ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు లేకపోలేదు. రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవి కాలం ఈ ఏడాది మార్చి 29వ తేదీతో పూర్తి కానుంది. దీంతో త్వరలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.

ఇక అవకాశం వచ్చిన నేతల శ్రేణుల్లో మంచి జోష్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎమ్మెల్సీ స్థానాలు దాదాపు టీఆర్ ఎస్ ఖాతాలోనే పడనున్నాయి.