Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రభుత్వ ఉద్యోగులకు వరాలు కురిపించిన.....ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి

Category : politics

ఏపి సీఎం గా వై.ఎస్ జగన్ పదవి బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన పనితనం లో మరింత స్పీడ్ పెంచాడు. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో నూతన మార్పులు తీసుకు వచ్చే దిశగా అడుగులు వేస్తున్నాడు.ఈ నేపథ్యంలో నే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొదటి సభలోనే ప్రజలందరికీ హామీ ఇస్తూ ....జగన్ ఒక మంచి సీఎం అని పించుకోడమే తన లక్ష్యంగా పని చేస్తానని చెప్పుకొచ్చారు. నేడు ముఖ్యమంత్రిగా సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వ ఉద్యోగులకు ఓ భారీ వరన్నే ప్రకటించారు. ఏకంగా రేపటి కేబినెట్ సమావేశం తర్వాత ఉద్యోగులకు 27 శాతానికి పైగా మధ్యంతర భృతి( ఐ.ఆర్) ను ప్రకటించనున్నట్టు జగన్ ప్రకటించారు. అంతేకాదు.. సీపీఎస్ రద్దుపై ఆదివారం జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని కూడా ఆయన హామీ ఇచ్చారు.ఇక ప్రభుత్వంలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు . ఇందుకోసం ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు జగన్ ప్రకటించారు.

విద్యార్హతను బట్టి పర్మనెంట్ చేస్తామని ఈ సంధర్బంగా జగన్ హామీ ఇచ్చారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలను పెంచుతామని జగన్ స్పష్టం చేశారు.సీఎం జగన్ ఏకంగా 27శాతం మధ్యంతర భృతిని ప్రకటించడంపై సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు తమ హర్షన్ని వ్యక్తం చేశారు. సీఎం జగన్ కు ఉద్యోగ సంఘాల నేతలు వచ్చి కృతజ్ఞతలు తెలిపారు. ఇక జగన్ తనను కలిసి ఉద్యోగులకు మీ సహాకారం కావాలని కోరారు. ముఖ్యమంత్రితో సన్నిహితంగా మెలుగుతామని.. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుకోవడానికి సన్నిహితంగా ఉంటామని వారంతా చెప్పుకొచ్చారు..ఇక జగన్ గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్న ఉద్యోగులను తాను తప్పుపట్టనని ఈ సందర్భంగా ఆయన హామీ కూడా ఇచ్చారు. ఎలాంటి భయాలు పెట్టుకోకుండా పనిచేసుకొని రాష్ట్రాభివృద్ధి లో పాలు పంచుకోవాలని ఆయన కోరారు.