//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Category : politics

గురువారం జ‌రిగిన టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశంలో పార్టీ నేత‌ల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నాయ‌కులంద‌రికీ పో ల‌వ‌రం ప్రాజెక్టు పురోగ‌తి గురించి చంద్ర‌బాబు వివ‌రించారు. ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న పోల‌వ‌రం ప్రాజెక్టు సంద‌ర్శ‌న‌కు ప్ర‌జ‌లు ప్ర‌తిరోజు 13 బ‌స్సుల్లో వెళ‌తార‌ని చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు 22 వేల మంది ప్ర‌జ‌లు పోల‌వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శించార‌న్నారు. ఒక ప్రాజెక్టు కోసం ఇంత‌గా క‌ష్ట‌ప‌డుతున్న సంద‌ర్భంగా దేశంలో ఎక్క‌డా లేద‌న్నారు.

ఇదే సంద‌ర్భంలో సీఎం చంద్ర‌బాబు టీడీపీ సీనియ‌ర్ నేత‌ల‌కు సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు. మీకు నా నుంచి ఎప్పుడైనా ఫోన్ రావొచ్చ‌న్నారు. పార్టీ కోసం, రాష్ట్రం కోసం, ప్ర‌జ‌ల కోసం క‌ఠినంగా ఉండ‌క త‌ప్ప‌ద‌న్నారు. వింటే వ్య‌క్తిగ‌తంగా చెప్తా.. విన‌ని ప‌క్షంలో ప్ర‌జ‌ల ముందే చెప్తా నంటూ సీఎం చంద్ర‌బాబు నేత‌ల‌ను హెచ్చ‌రించారు. సోష‌ల్ మీడియాను విస్థృతంగా కాపాడుకోవాల‌ని చంద్ర‌బాబు సూచించారు. ఈ సంద‌ర్బంగా కొంద‌రు నేత‌ల వ్య‌వ‌హార శైలిపై కూడా చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల‌కు నేత‌లు వెళ్ల‌డం లేద‌ని మండిప‌డ్డారు. టీడీపీ నేత‌లు, నాయ‌కులు, మంత్రులు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో లేకుండా ఉంటే తీవ్రంగా ప‌రిగ‌ణించాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. రాజకీయాల్లో రాణించాలంటే నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండాల‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు.