//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నేడు ,రేపు కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన .. షెడ్యూల్ ఇదే

Category : state politics

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజులపాటు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం నుంచి రెండ్రోజుల పాటు బాబు జిల్లాలో పర్యటించనున్నారు. జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు దూకుడుగా ప్రచారం సాగిస్తున్నారు.

సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఇలా వుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఆళ్లగడ్డకు చేరుకుంటారు. ఆళ్లగడ్డ నాలుగు రోడ్ల కూడలిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు నంద్యాల చేరుకుని ఎన్నికల రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం శ్రీనివాసనగర్‌ సెంటర్‌లో ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు.

సాయంత్రం 5:30 గంటలకు కర్నూలు ఏపీఎస్‌పీ బెటాలియన్ మైదానానికి హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు.అక్కడ్నుంచి కొత్తబస్టాండ్, మౌర్యా ఇన్ సర్కిల్, రాజ్‌విహార్, పార్క్ రోడ్డు, ఉస్మానియా కళాశాల, వన్‌టౌన్, పూలబజార్, చౌక్ బజార్ వరకు జరిగే రోడ్‌షోలో సీఎం పాల్గొంటారు.చౌక్‌బజార్ దగ్గర జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దులా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.అనంతరం రోడ్ షో పెద్ద మార్కెట్ మీదుగా పాత బస్టాండ్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుంటుంది. అక్కడ చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తిరిగి కొండారెడ్డి బురుజు, పాత కంట్రోల్ రూం, కిడ్స్ వరల్డ్ మీదుగా బెటాలియన్‌కు చేరుకుంటారు. రాత్రి కర్నూలులో బస చేస్తారు.

ఇక 27వ తేదీ ఉదయం కర్నూలు నుంచి బయలుదేరి రోడ్డుమార్గం ద్వారా ఉదయం 10:30 గంటలకు ఎమ్మిగనూరు చేరుకుంటారు.ఎమ్మిగనూరులో స్పిన్నింగ్ మీల్ గ్రౌండ్ నుంచి రోడ్ షో ఉంటుంది.ఆ తర్వాత మాచాని సోమప్ప సర్కిల్‌లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

మధ్యాహ్నం ఒంటి గంటకు పత్తికొండ చేరుకుని జూనియర్ కళాశాల మైదానం నుంచి రోడ్ షో ప్రారంభిస్తారు. పోలీస్‌స్టేషన్ ఎదుట ఉన్న సర్కిల్ నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.సాయంత్రం నాలుగు గంటలకు నంద్యాలలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించనున్నారు.

Related News